అసెంబ్లీ కారిడార్ అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం యోగిఆదిత్యనాథ్

* అసెంబ్లీ కారిడార్ అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం యోగిఆదిత్యనాథ్

Update: 2022-12-06 03:21 GMT

అసెంబ్లీ కారిడార్ అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం యోగిఆదిత్యనాథ్

Lucknow: ఉత్తర్‌ప్రదేశ్‌ విధానసౌధ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. విధాన సౌధ కారిడార్ ఏర్పాటుతో పాటు, అసెంబ్లీ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. లక్నోలో పూర్తి చేసుకున్న అసెంబ్లీ కారిడార్‌‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవం చేశారు. ఆధునికీకరణ పనులతర్వాత విధాన సభ నిండుదనంతో సరికొత్త శోభను సంతరించుకుంది. సర్వహంగులతో రూపుదిద్దుకున్న విధాన సభలో శీతాకాల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులను ఆమోదించనున్నారు. 33 వేల 789 కోట్ల సప్లమెంటరీ బడ్జెట్‌‌ను ఆర్థిక మంత్రి సురేశ్ ఖన్నా ప్రవేశ పెట్టి ఆమోదం పొందనున్నారు. కొత్తపథకాలకు నిధులు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, స్మార్ట్ సిటీస్, పారిశ్రామిక వాడల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ యోచిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆర్ధిక మంత్రి సురేశ్‌ఖ‌న్నా సభలో బిల్లును ప్రవేశ పెట్టబోతున్నారు.

Tags:    

Similar News