టెన్త్, ఇంటర్ టాపర్లకు హెలికాఫ్టర్ లో చక్కర్లు.. మాట నిలబెట్టుకున్న సీఎం..

Chhattisgarh: చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశం కల్పించింది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం.

Update: 2022-10-09 04:25 GMT

టెన్త్, ఇంటర్ టాపర్లకు హెలికాఫ్టర్ లో చక్కర్లు.. మాట నిలబెట్టుకున్న సీఎం..

Chhattisgarh: చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశం కల్పించింది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం. టెన్త్, ఇంటర్ టాపర్లను ప్రభుత్వం హెలికాప్టర్‌లో రైడ్‌కు తీసుకెళ్లింది. ఇలా చేసి స్టూడెంట్స్‌కు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్. హెలికాప్టర్‌లో గగన విహారం చేసిన విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తొలిసారి గాల్లో ప్రయాణించామని, చాలా సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులను హెలికాప్టర్‌లో తిప్పుతామని గత మే నెలలో సీఎం భూపేశ్ బఘేల్ హామీ ఇచ్చారు. విద్యార్థుల్ని మరింత ప్రోత్సహించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని సీఎం తెలిపారు.

Tags:    

Similar News