Breaking News: నెక్ట్స్‌ సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌.. వచ్చేనెల 9న ప్రమాణస్వీకారం

*రెండేళ్లపాటు సేవలందించనున్న చంద్రచూడ్‌

Update: 2022-10-17 15:01 GMT

Breaking News: నెక్ట్స్‌ సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌.. వచ్చేనెల 9న ప్రమాణస్వీకారం

Next Chief Justice Of India: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వచ్చేనెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. నవంబరు 8న ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్‌ పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తన వారుసడిగా జస్టిస్‌ చంద్రచూడ్‌ను చీఫ్‌ జస్టిస్‌ లలిత్‌ ఎంపిక చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా లలిత్‌ 74రోజుల పాటు కొనసాగనున్నారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ మాత్రం రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

2024 నవంబరు 10న చంద్రచూడ్‌ పదవికాలం ముగియనున్నది. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చంద్రచూడ్‌ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2013 నుంచి అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2000 నుంచి 2013 వరకు బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. 1998 నుంచి 2000 వరకు అదనపు భారత సోలిసిటర్‌ జనరల్‌గా పని చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా.. చంద్రచూడ్‌ నుంచి పలు కీలకమైన తీర్పులు వెలువడ్డాయి. 

Tags:    

Similar News