తూర్పు లడఖ్‌ నుంచి వెనక్కు మళ్ళుతున్న చైనా

Update: 2021-02-16 15:42 GMT

తూర్పు లఢఖ‌్‌ నుంచి చైనా ఆర్మీ వెనక్కు వెళ్ళిపోతోంది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు చైనా సేనలు వెనక్కు మళ్ళుతున్నాయి. పాంగాంగ్ సరస్సు వద్ద ఏర్పాటు చేసిన గుడారాలను, ఇతర తాత్కాలిక స్థావరాలను తొలగిస్తున్నారు చైనా సైనికులు. క్షేత్రస్థాయిలో చైనా చేపడుతున్న చర్యలకు సంబంధించిన ఫొటో, వీడియోను భారత్ ఆర్మీ మంగళవారం షేర్ చేసింది. వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా యుద్ధ ట్యాంకులు వెనక్కు మళ్లుతున్న దృశ్యాలు వీటిల్లో ఉన్నాయి. పది నెలల క్రితం పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరం వెంబడి చైనా వీటిని మోహరించింది.

Tags:    

Similar News