గుజరాతీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ఛెల్లో షో బాలనటుడు రాహుల్‌ కన్నుమూత

*కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న రాహుల్‌

Update: 2022-10-11 14:45 GMT

గుజరాతీ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. ఛెల్లో షో బాలనటుడు రాహుల్‌ కన్నుమూత

Rahul Koli: అంతర్జాతీయంగా సంచలనం సృష్టించి ఆస్కార్‌ బరిలోకి దిగుతున్న ఛెల్లో షో బాలనటుల్లో ఒకరైన రాహుల్‌ కోలి కన్నుమూశారు. కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్న రాహుల్‌ అక్టోబర్‌ 2న అహ్మదాబాద్‌లోని క్యాన్సర్‌ ఇన్‌‌స్టిట్యూట్‌లో చేశారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న రాహుల్‌ మృతి గుజరాత్‌ చిత్ర పరిశ్రమను విషాదానికి గురి చేసింది. భారత్‌ తరఫును విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్‌ బరిలో ఛెల్లో షో దిగనున్నది. ఈ చిత్రం మరో రెండ్రోజుల్లో విడుదల కానున్నది. ఈ సమయంలోనే రాహుల్‌ మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. రాహుల్‌ తండ్రి రాము కోలి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఛెల్లో షో రిలీజ్‌ అయిన తరువాత.. మన జీవితాలు మారిపోతాయని.. రాహుల్‌ అంటుండేవాడని తండ్రి రాము కన్నీటి పర్యంతమయ్యారు.

అక్టోబరు 2న అల్పాహారం తీసుకున్న రాహుల్‌.. జర్వం వచ్చిన తరువాత మూడు సార్లు వాంతులు చేసుకున్నాడు. ఆ తరువాత.. చిన్నారి రాహుల్‌ను అహ్మదాబాద్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. అక్టోబరు 14న కుటుంబమంతా సినిమా చూడాలనుకున్నామని.. అంతలోనే రాహుల్‌ మాకు దూరమయ్యారంటూ.. తండ్రి రాము కోలి రోదించారు. ఛెల్లో షో సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఆరుగురు బాల నటుల్లో రాహుల్‌ కోలి ఒకరు. ఇటీవల రాహుల్‌ చికిత్స కోసం ఆటోను తండ్రి అమ్మేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఛెల్లో షో మూవీ టీమ్‌.. ఆటోను తిరిగి ఇప్పించింది. రాహుల్‌ మృతిపై పలువురు ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సినిమాని అమితంగా ఇష్టపడే ఓ తొమ్మిదేళ్ల కుర్రాడి కథతో 'ఛెల్లో షో' చితక్రాన్ని నిర్మించారు దర్శకుడు నళిన్‌ పాన్‌. స్వీయ అనుభవాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో భవిన్‌ రాబరి అనే బాల నటుడు ప్రధాన పాత్ర పోషించగా భవేశ్‌ శ్రీమాలి, రిచా మీనా, దిపెన్‌ రావల్‌, పరేశ్‌ మెహతా, రాహుల్‌ కోలి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తొలిసారి గతేడాది జూన్‌లో ట్రిబెకా చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. స్పెయిన్‌లో జరిగిన 'వల్లాడోలిడ్‌' చిత్రోత్సవంలో గోల్డెన్‌ స్పైక్‌ పురస్కారంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఇప్పుడు భారత్‌ తరఫున అధికారికంగా ఆస్కార్‌ 2023 బరిలోకి దిగుతోంది. మన దేశంలో 12న విడుదల కానున్నది. ఇంగ్లిష్‌ వెర్షన్‌లో 13న 'లాస్ట్‌ ఫిల్మ్‌ షో'గా విడుదల కానున్నది.

Tags:    

Similar News