Meet Anmol:ఈ దున్న ఖరీదు రూ. 23 కోట్లు

ఇక్కడ మీరు చూస్తున్న దున్నపోతు విలువ రూ.23 కోట్లు. అవును మీరు వింటున్నది నిజమే.. ఇంతకీ దీని గొప్పతనం ఏంటో అనుకుంటున్నారా.. అయితే అదేంటో తెలుసుకుందాం.

Update: 2024-11-15 13:48 GMT

సాధారణంగా మనం పల్లెటూర్లలో దున్నపోతులను చూస్తుంటాం. దీని ధర మా అంటే రూ.20, 30 వేలో ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూస్తున్న దున్నపోతు విలువ రూ.23 కోట్లు. అవును మీరు వింటున్నది నిజమే.. ఇంతకీ దీని గొప్పతనం ఏంటో అనుకుంటున్నారా.. అయితే అదేంటో తెలుసుకుందాం.

హర్యానాలోని సిర్సాకు చెందిన పల్వీందర్ సింగ్ అనే రైతు అన్మోల్ అనే దున్నపోతును పెంచుకుంటున్నారు. దీని నుంచి నెలకు రూ.4 నుంచి రూ.5 లక్షల సంపాదిస్తున్నారు. దాన్ని రూ.23 కోట్లకు కొనడానికి వచ్చినా అమ్మేందుకు ఆయన అంగీకరించలేదు. నెలకు రూ. 4 నుంచి దున్నపోతు నెలకు లక్షల్లో సంపాదించడమేంటని అనుకుంటున్నారా.. మీరు వింటున్నది కరెక్టే ఆ దున్నపోతు వీర్యాన్ని అమ్మి అతడు నెలకు లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు.

పల్వీందర్ సింగ్ పెంచుకుంటున్న దున్నపోతు వయసు 8 ఏళ్లు. దాని బరువు 1500 కిలోలు. పుష్కర మేళా, మీరట్ లోని ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ఈవెంట్లలో ఈ అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్మోల్ ధర, భారీ ఆకారమే దాన్ని వార్తల్లో నిలిచేలా చేస్తోంది. అంతేకాదు దీని జీవన శైలి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దీని ఆరోగ్యం కాపాడడానికి, బలంగా ఉంచడానికి డ్రైఫ్రూట్స్ పెడతారు. అధిక క్యాలరీలు కలిగి ఉండే ఆహార పదార్థాలను కలిపి దున్నకు అందిస్తామని యజమాని పల్వీందర్ సింగ్ తెలిపారు.

అంతేకాదు దీనికి ప్రతిరోజు 250 గ్రాముల బాదం, 30 అరటి పండ్లు, 4 కిలోల దానిమ్మ, 5 లీటర్ల పాలు, 20 ఎగ్స్, ఆయిల్ కేక్, పచ్చిమేత, నెయ్యి, సోయా బీన్స్, మొక్కజొన్న ఆహారంగా ఇస్తామన్నారు. ప్రత్యేకంగా అందించే ఆహారం వల్లే అన్మోల్ ఎల్లప్పుడు ప్రదర్శనలకు, సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు.

ఆహారంతో పాటు ప్రతి రోజూ దీనికి రెండుసార్లు స్నానం, బాదం-ఆవాల నూనె ప్రత్యేక మిశ్రమంతో మసాజ్ చేస్తారు. వారానికి రెండు సార్లు అన్మోల్ నుంచి వీర్యం సేకరిస్తున్నారు. దీనికి పశువుల పెంపకందారుల్లో మంచి డిమాండ్ ఉంది. తన కుటుంబంలో సభ్యుడిగా చూస్తున్నందునే అందుకే దాన్ని అమ్మడం లేదని పల్వీందర్ సింగ్ తేల్చి చెప్పారు.

Tags:    

Similar News