Ayushman Bharat Yojana: 15 నిమిషాల్లోనే Ayushman Card..పూర్తి వివరాలివే
Ayushman Bharat Yojana: గత నెల అక్టోబర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 70ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సుకన్న వ్యక్తులకు వారి ఆదాయ స్థాయితో సంబంధం లేకుండా ఆరోగ్య కవరేజీని చేర్చేందుకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన విస్తరణను ప్రకటించారు. దీనికోసం కేంద్రం ఆయుష్మాన్ వయ వందన కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డులు 70ఏళ్లుపైబడిన వృద్ధులకు 5లక్షల వరకు కవర్ అందిస్తుంది. కాగా నేషనల్ హెల్త్ అథారిటీ డేటా ప్రకారం..ఈ పథకం ప్రారంభించిన 11 రోజుల్లో దాదాపు 6.5లక్షల మంది వృద్ధులు ఆయుష్మాన్ కార్డును విజయవంతంగా నమోదు చేసుకున్నారు. మీరు కూడా ఆయుష్మాన్ భారత్ కార్డును కేవలం 15నిమిషాల్లోనే పొందవచ్చు. ఎలాగో చూద్దాం.
Ayushman Bharat Yojana: ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనను 70ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులను చేర్చేందుకు విస్తరించిన 11 రోజుల్లోనే దేశంలో వృద్ధ లబ్దిదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. దీంతో దరఖాస్తుదారుల సంఖ్య ఈ కాలంలో 6.5లక్షలుగా నమోదు అయినట్లు నేషనల్ హెల్త్ అథారిటీ డేటా తెలియజేస్తోంది. మధ్య ప్రదేశ్, యూపీ, కర్నాటక, హర్యానా లబ్దిదారుల్లో వెనబడి ఉండగా..కేరళకు చెందిన లబ్దిదారులు ముందు వరుసలో ఉన్నారు. ఆయుష్మాన్ వయ వందన కార్డు పెద్ద సంస్థల్లో నివసిస్తున్న వృద్ధులకు కాంప్లిమెంటరీ వైద్య సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. సీనియర్ సిటిజన్లు అవసరమైనప్పుడు అధిక నాణ్యత వైద్య చికిత్సను పొందేందుకు ఈ పథకాన్నిరూపొందించింది.ఆదాయంతో సంబంధం లేకుండా 70ఏళ్లు పైబడిన వ్యక్తులకు కార్డు అందించారు.
ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రుల్లో భాగస్వామ్యం ఉంది.ఈ ఎంపానెల్డ్ ఆసుపత్రులకు పథకం కింద నాణ్యమైన ఆరోగ్యసేవలను అందిస్తాయి. లబ్దిదారులు తమ చికిత్స అవసరాలకు అనుగుణంగా వైద్య సౌకర్యాల విస్తృత శ్రేణి నుంచి ఎంపిక చేసుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకం భారతదేశంలో వృద్ధులకు ప్రాప్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ వైపు ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. దరఖాస్తు ప్రక్రియను సరళీక్రుతం చేయడం, గణనీయమైన ప్రయోజనాలను అందించడం ద్వారా, ఇది వృద్ధులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ అవసరమైన వైద్య సంరక్షణను అందిస్తుంది. దీనికోసం U -Win అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక నేపథ్యంతో ఎలాంటి సంబంధం లేకుండా ఫ్రీగా ఆసుపత్రి చికిత్సను పొందేందుకు ఈ కార్డులు దోహదం చేస్తాయి. అర్హులైన దరఖాస్తుదారులు కార్డు కోసం నమోదు చేసుకునేందుకు అధికారిక ఆయుష్మాన్ యోజన పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కార్డును పొందేందుకు కేవలం 15నిమిషాలు పడుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబ సభ్యులందరూ పథకం కింద కవరేజీని పొందుతారు. ఇప్పటివరకు 7.37కోట్ల మంది ఆసుపత్రుల్లో ఈ పథకం కింద అడ్మిషన్లు పొందారు. ఇందులో 49శాతం మంది మహిళలు ఉన్నారు.
ఆయుష్మాన్ వయ వందన కార్డు కోసం నమోదు ఇలా చేసుకోండి
1. నేషనల్ హెల్త్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
2. అందించిన క్యాప్చా కోడ్‌తో హోమ్‌పేజీలో లాగిన్ అవ్వండి. మీ మొబైల్ నంబర్‌ను ఇన్‌పుట్ తో OTP వస్తుంది.
3. తదుపరి స్క్రీన్ లో పథకం రాష్ట్రం, ఉపపథకం,జిల్లా కోసం డ్రాప్ డౌన్ మెనుల్లో సంబంధిత ఆప్షన్స్ సెలక్ట్ చేసుకోండి.
4. వివరాలు ఏవీకనిపించకపోతే 70ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్రుద్ధుల కోసం నమోదు చేయడానికి క్లియర్ ఆప్షన్ ఎంచుకోవాలి.
5. తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ను నమోదు చేసి సెర్చ్ క్లిక్ చేయండి. డేటా బేస్ లో వివరాలు కనిపించినట్లయితే దిగువన ఫ్రెష్ ఎన్ రోల్ మెంట్ ఆఫ్ 70పై క్లిక్ చేయమని మెసేజ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
6. తర్వాత స్క్రీన్ ఈ కేవైసీ ఆప్షన్ కనిపిస్తుంది. దరఖాస్తుదారులు అందుబాటులో ఉన్న ఏవైనా ఆఫ్షన్స్ ఎంచుకునే సౌలభ్యాన్ని కలిగి ఉంటారు. ఈ గైడ్ ప్రయోజనం కోసం మేము AadC OTP వస్తుంది. ఆ నెంబర్ ను పూర్తిగా సమీక్షించిన తర్వాత ఆ బాక్సును సెలక్ట్ చేసుకుని పర్మిషన్ పై క్లిక్ చేయండి.
7. AadC లింక్ చేయసిన మొబైల్ నెంబర్ తో పాటు వినియోగదారు మొబైల్ నెంబర్ రెండింటికి ఓటీపీ వస్తుంది.
8. ఈ కేవైసీ విజయవంతంగా పూర్తైన తర్వాత ఈ కేవైసీ సక్సెస్ అయ్యిందని తెలిపే కన్ఫర్మెషన్ మెసేజ్ వస్తుంది.
9.దీనితర్వాత సిస్టమ్ ఆటోమెటిగ్గా పేరు, తండ్రిపేరు, పుట్టినతేదీ మొదలైన లబ్దిదారుల వివరాలు వస్తాయి. లబ్దిదారుడు ఆర్కైవల్ ప్రయోజనాల కోసం ఫొటోగ్రాఫ్ తీసుకోవాలి. మరిన్ని వివరాలను అందించాలి. ఫారమ్ ను కన్ఫర్మ్ చేసి సమర్పించే ముందు మొబైల్ నెంబర్, వర్గం పిన్ కోడ్, అడ్రస్, కుటుంబ సభ్యులందరికీ సంబంధించిన సమగ్ర సమాచారం నింపాలి.
10. సక్సెస్ ఫుల్ గా అందించిన తర్వాత ప్రక్రియ పూర్తవుతుంది. దీని తర్వాత ఆయుష్మాన్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవడానికి కొంత సమయం అవసరం అవుతుంది. 15 నిమిషాల తర్వాత సీనియర్ సిటిజన్స్ కోసం కార్డు డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది.