Fire Accident: యూపీ ఝాన్సీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: 10 మంది చిన్నారుల సజీవదహనం
Jhansi Medical College: ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు వ్యాపించి 10 మంది చిన్నారులు సజీవదహనమయ్యారు.
Jhansi Medical College: ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మంటలు వ్యాపించి 10 మంది చిన్నారులు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 47 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. మంటలను గుర్తించిన చిన్నారుల పేరేంట్స్ తమ పిల్లలను తీసుకొని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు.
ఇలా బయటకు తీసుకురాలేని 10 మంది చిన్నారులు చనిపోయారు. మరో 16 మంది చిన్నారులు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 10:45 గంటలకు షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించాయని జిల్లా మేజిస్ట్రేట్ అవినాష్ కుమార్ చెప్పారు.
ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు.