చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.. బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతపై సుప్రీం సంచలనం..

Supreme Court: నిందితుల ఇళ్లను బుల్‌డోజర్లతో కూల్చడం సరైంది కాదని సుప్రీంకోర్టు తెలిపింది.

Update: 2024-11-13 07:25 GMT

చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.. బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతపై సుప్రీం సంచలనం..

Supreme Court: నిందితుల ఇళ్లను బుల్‌డోజర్లతో కూల్చడం సరైంది కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఒక వ్యక్తి దోషి అని తేల్చి చెప్పలేరని.. జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో మితిమీరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇళ్లను కూల్చడం నివసించే హక్కును కాలరాయడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. నిష్ఫాక్షికంగా విచారణ పూర్తికాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దోషిగా నిర్ధారిస్తే చట్టప్రకారంగానే శిక్ష ఉంటుందని కోర్టు స్పష్టంచేసింది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో బుల్‌డోజర్లతో ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నాయి. తొలుత ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా పద్దతిని అవలంబిస్తున్నారు. నిందితుల ఇళ్లను, స్థిరాస్తులను బుల్‌డోజర్లతో కూల్చుతున్నారు. దీనిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెల్లడించింది.

షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా ఎలాంటి కూల్చివేతలు చేయవద్దని సూచించింది. కనీసం 15 రోజుల ముందుగానే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది కోర్టు. కూల్చివేతల ప్రక్రియను వీడియోతో చిత్రీకరించాలని కూడా ఉన్నత న్యాయస్థానం కోరింది. కూల్చివేతలే ఎందుకు ఎంచుకున్నారనే విషయాన్ని అధికారులు వివరించాలని కూడా కోర్టు తెలిపింది.

Tags:    

Similar News