School Holidays: విద్యార్థులకు అదిరిపోయే వార్త..పాఠశాలలకు 4రోజులు సెలవులు
School Holidays: కాలుష్యం కారణంగా ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. ఉత్తర భారత రాష్ట్రాలను ప్రస్తుతం తీవ్రమైన కాలుష్యం సమస్య వేధిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరిస్థితిని బట్టి మరిన్ని రోజులు సెలవులు పొడిగించే ఛాన్స్ ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని వాహనాల రాకపోకలపై నిర్మణ రంగ పనులపైనా ఆంక్షలను విధించింది.
అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఉత్తర భారత రాష్ట్రాలైన ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రాలో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు అమలు చేస్తున్నాయి. ప్రభావిత రాష్ట్రాల్లో గాలి నాణ్యత సూచీలు ప్రమాదకరమైన స్థాయికి మించి నమోదు అవుతుండటంతో విద్యార్ధుల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
హర్యానాలో గాలి నాణ్యత సూచీ ఏక్యూఐ 320 నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యాన్ని పరీరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి వరకు విద్యార్థులకు హర్యానా సర్కార్ సెలవులు ప్రకటించింది. ఈనెల 22వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని వెల్లడించింది. స్థానిక గాలి నాణ్యత పరిస్థితులను బట్టి సెలవును పొడిగించడానికి లేదా ఆన్ లైన్ తరగతులకు మార్చేందుకు డిప్యూటీ కమిషనర్స్ ను అనుమతిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది.
కాగా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనప్పటికీ పంజాబ్ ప్రభుత్వం కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గాలి నాణ్యత సూచీ 207 నమోదు అవ్వడంతో ముందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. తీవ్రమైన గాలి కాలుష్యం ద్రుష్ట్యా పాఠశాలలను మూసివేసి ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న 10,12 తరగతుల విద్యార్థులు మాత్రం పాఠశాలలకు రావాలని తెలిపింది.