Train Ticket Transfer: మీ ట్రైన్ జర్నీ వాయిదా పడిందా? డబ్బులు నష్టపోకుండా ఇలా చేయొచ్చు
Train Ticket Transfer: సుదూర ప్రదేశాలకు ట్రిప్ వెళ్లాల్సి వచ్చినా.. లేదా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకున్నపుడు ప్రతీఒక్కరు ముందుగానే ట్రైన్ టికెట్లు రిజర్వేషన్ చేసి పెట్టుకుంటారు. ఒక్కోసారి అనివార్య కారణాల వలన ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో టికెట్ రద్దు చేసుకుంటే.. రైల్వేశాఖ క్యాన్సిలేషన్ రుసుము మినహాయించుకుని మిగిలిన డబ్బును చెల్లిస్తుంది. అప్పుడు ప్రయాణికులు కొంత డబ్బును నష్టపోతారు. అయితే ఈ క్యాన్సిలేషన్ రుసుము సహా మొత్తం డబ్బును పొందడానికి కూడా మార్గాలున్నాయి తెలుసా? తెలియకపోతే ఇదిగో ఈ డీటేల్స్ మీకోసమే.
మీ ట్రైన్ ప్రయాణం క్యాన్సిల్ అయితే.. బుక్ చేసుకున్న టికెట్‌ను క్యాన్సిల్ చేయకుండా, టికెట్ డబ్బులు నష్టపోకుండా జాగ్రత్త పడే మార్గం ఉంది. కాకపోతే బుక్ చేసుకున్న టికెట్‌ను రద్దు చేసుకోకుండా ట్రాన్స్‌ఫర్ చేయాలి. అయితే ఆ టికెట్‌ను మీ కుటుంబ సభ్యులకు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. టికెట్‌ను కుటుంబ సభ్యులకు కాకుండా.. వేరే వ్యక్తులకుట్రాన్స్‌ఫర్ చేయడం కుదరదు. ట్రైన్ బయలుదేరడానికి 24 గంటల ముందు ఈ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్‌లో రిజర్వేషన్ కౌంటర్‌కు వద్దకు వెళ్లి ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆన్‌లైన్‌లో బుక్ చేసినా లేదా రిజర్వేషన్ కౌంటర్ నుండి తీసుకున్నా ఇదే ప్రాసెస్ వర్తిస్తుంది. తత్కాల్ టికెట్లను మార్చుకోవడం మాత్రం సాధ్యం కాదు.
రిజర్వేషన్ కౌంటర్ వెళ్లేముందు మీ ట్రైన్ టికెట్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి. అలానే ఎవరి పేరు నమోదు చేయాలనుకుంటున్నారో వారి ఒరిజినల్ ఐడి ఫోటో కాపీని కౌంటర్‌కు తీసుకెళ్లాలి. అక్కడ టికెట్ ట్రాన్స్‌ఫర్ ఫామ్‌ను ఫిల్ చేయాలి. ఆపై రైల్వే అధికారులు ప్రయాణికుడి పేరు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. మీద బదిలీ చేయబడిన పేరు జర్నీ ప్యాసిండర్స్ లిస్టు, టికెట్‌పై చేర్చబడుతుంది. ఒక్కసారి ట్రాన్స్‌ఫర్ పూర్తయితే ఇక ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలుకాదు.
గ్రూప్ టికెట్లకు కూడా ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ ఉంది కానీ.. అందుకు 48 గంటలకు ముందే రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ ట్రిప్‌లో అయితే.. ఒక స్టూడెంట్ మరో స్టూడెంట్ పేరుపైకి ట్రైన్ టికెట్‌ను ట్రాన్‌ఫర్ చేసుకోవడానికి వీలుంది. అయితే ఆ స్టూడెంట్స్ చదివే ఇన్‌స్టిట్యూట్ ఒక్కటే అయి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా డ్యూటీ మీద ప్రయాణం చేసేటపుడు టికెట్‌ను సహోద్యోగి పేరుపైకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంది.