Delhi Pollution: కాలుష్య కొరల్లో దేశ రాజధాని..లాక్ డౌన్ ఒక్కటే మార్గమా?

Update: 2024-11-19 06:06 GMT

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కొరల్లో చిక్కుకుంది. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ఆగే సూచనలు కనిపించడం లేదు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఢిల్లీ మరోసారి గ్యాస్ ఛాంబర్ గా మారిపోయిన పరిస్థితి నెలకొంది. గాలి నాణ్యత సూచిక 400 దాటేసింది. ఢిల్లీలో ప్రతి ఏడాది ఈ సమస్య తీవ్రమవుతోంది. ఢిల్లీ కాలుష్యాన్ని లాక్ డౌన్ మాత్రమే తొలగించగలదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఢిల్లీలో లాక్ డౌన్ ఒక్కటే మార్గమా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది.

ఢిల్లీ పరిస్థితి నగర విషపూరిత వాతావరణానికి అద్దం పడుతోంది. ఢిల్లీలోని గాలికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఊపిరి పీల్చుకోవడం కష్టం మారుతోంది. ఢిల్లీలోని గాలిని పీల్చడం ప్రతిరోజూ 30 నుంచి 40 సిగరెట్లు తాగడంతో సమానమని పలు నివేదికలు చెబుతున్నాయి.

తీవ్రమైన కేటగిరీ నుంచి కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయికి చేరింది. ఏక్యూఐ స్కేల్ 400దాటిన తర్వాత ఢిల్లీలో గ్రేప్ 4ని అమలు చేయాల్సి వచ్చింది. దీంతో స్కూళ్లు మూసివేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. చలికాలం వచ్చిందంటే ఢిల్లీలో చాలా ఏళ్లుగా ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకారం కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల జీవిత కాలం పదేళ్లు తగ్గుతోంది. అయినప్పటికీ ఏ ప్రభుత్వమూ దీనికి బాధ్యత వహించడానికి సిద్ధంగా లేదు.

కాబట్టి ఈ పరిస్థితిలో లాక్ డౌన్ మాత్రమే ఢిల్లీ కాలుష్యాన్ని తొలిగిస్తుందా అనే సందేహం కూడా కలుగుతోంది. కరోనా కాలంలో లాక్ డౌన్ విధించినా వాతావరణంలో గాలి కాలుష్యం ఏమాత్రం తగ్గలేదు. లాక్ డౌన్ కారణంగా గాలిలోనే కాదు..నీరు, శబ్ద కాలుష్యం కొంతమేర తగ్గింది.

అయితే అది మహమ్మారి సంక్షోభం కానీ ఇప్పుడు లాక్ డౌన్ అమలు చేయడం అంత ఈజ కాదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఉదాహరణకు 2020లో లాక్ డౌన్ అయిన మొదటి 21 రోజుల్లో ఆనంద్ విహార్ లో పీఎం 2.5 స్థాయిలు 300 నుంచి 101కి పడిపోయాయి. అయితే కాలుష్యాన్ని అరికట్టేందుకు లాక్ డౌన్ శాశ్వత పరిష్కారం అవుతుందా అనే ప్రశ్న తలెత్తుతుంది.

ఉజాలా సిగ్నస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ షుచిన్ బజాజ్ మాట్లాడారు. లాక్ డౌన్ వల్ల కాలుష్యం తాత్కాలికంగా తగ్గుతుందని అయితే అది పరిష్కారంకాదని కోవిడ్ సమయంలో చూసినట్లుగా దీని ప్రభావం పేదలపై పడుతుందన్నారు.

బ్రిటన్ గ్రేట్ స్మోగ్ కాలుష్యం కారణంగా 12వేల మందిమరణించారు. అయినా లాక్ డౌన్ విధించలేదు. బదులుగా బ్రిటిష్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. కాలుష్యానికి వ్యతిరేకంగా ఢిల్లీ కూడా ఈ విధమైన రాజకీయ సంకల్పాన్ని ప్రదర్శించాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News