Vandana Shah: రెహమాన్ విడాకులతో తెరపైకి విడాకుల ఎక్స్‌పర్ట్ వందన షా పేరు
Vandana Shah: వందన షా (Vandana Shah).. ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) విడాకులతో వందన షా పేరు తెరపైకి వచ్చింది.
Vandana Shah: వందన షా (Vandana Shah).. ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) విడాకులతో వందన షా పేరు తెరపైకి వచ్చింది. ఇంతకీ ఎవరీ వందన షా. వందన షా ఓ అడ్వకేట్. దేశంలో హైప్రోఫైల్ డివోర్స్ కేసులు వాదించే మహిళా లాయర్‌గా వందనా షాకు పేరుంది. ఎన్నో జంటలకు విడాకులు ఇప్పించిన ఈమె.. ఏ.ఆర్. రెహమాన్, సైరా భానుల (Saira Banu) విడాకులతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు.
డివోర్స్ అయిన వందన ఆ తర్వాతే లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈమె గుజరాత్‌కు చెందిన అడ్వకేట్. ముంబై, పూణేలో లా ప్రాక్టీస్ చేస్తారు. సంపన్నులకు విడాకులు ఇప్పించడంలో ఎక్స్‌పర్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. విడాకులు ఇప్పించడం మీకు సంతోషమా ? అని ఎవరైన అడిగితే నేను స్వేచ్ఛను ఇప్పిస్తున్నాను అంటారు వందన. ముంబైలో ఉండే జంటల విడాకుల కారణాలు అనూహ్యంగా ఉంటాయంటారు వందన. శ్రీమంతుల ఇళ్లల్లో భార్యభర్తల మధ్య డబ్బు పంపకం, పిల్లల బాధ్యత ఇవే ప్రధాన సమస్యలని.. ఇగో, వివాహేతర సంబంధాలు తర్వాత స్థానంలో ఉంటాయంటారు.
బాగా డబ్బున్న వారు పెళ్లికి ముందే అగ్రిమెంట్ చేసుకోవడం మంచిదని చెబుతారు. ఒక వేళ విడిపోతే ఎవరికి ఎంత, పిల్లలకు ఎంత.. ఇవి మాట్లాడుకుంటే అసలు వైవాహిక జీవితంలో గొడవులే రావు అంటుందామె. పరస్పరం హింసించుకునే పెళ్లి కంటే విడాకులే మంచిదని చెబుతారు. అయితే పెళ్లితో బాధపడుతున్న పురుషుల గురించి కూడా ఆమె మాట్లాడారు. బాగా సంపాదించే భార్య తన భర్తను ఇంటిపట్టున ఉండమని కోరడం, అతనిపై ఆధిపత్యం చెలాయించడం చూస్తున్నాం. మగాళ్లు హౌస్ హజ్బెండ్‌లుగా ఉండడాన్ని ఇష్టపడుతున్నా ఆధిపత్యం, అవమానం భరించలేక విడాకులు కోరుతున్నారని తెలిపారు.
రెహమాన్ దంపతులు విడాకుల వ్యవహారం అందరినీ షాక్‌కు గురిచేసింది. 1995లో ఏ.ఆర్. రెహమాన్ పెళ్లయింది. అదే సంవత్సరం అతను సంగీతం చేసిన బొంబాయి సినిమా విడుదలైంది. వచ్చే సంవత్సరం బొంబాయి సినిమా, రెహమాన్ వైవాహిక జీవితం 30 ఏళ్ల ఉత్సవం జరుపుకోవాల్సి ఉంది. ఇంతలోనే సంగీత మాంత్రికుడు రెహమాన్ జీవితంలో చోటుచేసుకున్న ఈ అనూహ్య ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రెహమాన్, సైరా భాను విడాకుల వ్యవహారాన్ని వందన షా అధికారికంగా ప్రకటించారు. రెహమాన్, సైరా భాను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని.. వారి వ్యక్తిగత కారణాల వల్లే వారి వివాహ బంధానికి స్వస్తి పలికారని సైరా తరపు లాయర్ వందన షా తెలిపారు. ఇది ఎవరూ ఊహించలేదు. ఈ ప్రకటనతో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.