Wagh Nakh: భారత్‌కు చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుదం వాఘ్ నఖ్
Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ వినియోగించిన వాఘ్ నఖ్ భారత్‌కు వచ్చేసింది.
Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ వినియోగించిన వాఘ్ నఖ్ భారత్‌కు వచ్చేసింది. లండన్ మ్యూజియం నుంచి బుధవారం తీసుకువచ్చినట్టు కేంద్ర మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. ఈ వ్యాఘ్ నఖ్‌ను రేపటి నుంచి మ్యూజియంలో 7 నెలల పాటు ప్రదర్శనకు ఉంచనున్నట్లు తెలిపారు. పులి పంజా ఆకారంలో ఉండే వాఘ్ నఖ్‌ని లోహంతో తయారు చేస్తారు. 1659లో బీజాపూర్ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్‌ను చంపడానికి శివాజీ ఈ వాఘ్ నఖ్ ను ఉపయోగించాడని చరిత్ర చెబుతోంది.
కాలక్రమంలో ఈ చారిత్రక వస్తువు బ్రిటన్‌కు చేరింది. లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఈ ఆయుధం భారత్ చేరుకుంది. బుల్లెట్ ప్రూఫ్ కవర్ లో ఉంచి ఈ ఆయుధాన్ని భద్రంగా భారత్‌కు తీసుకువచ్చారు.