తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు: సినీ నటి కస్తూరిపై కేసు
సినీ నటి కస్తూరిపై కేసు నమోదు చేశారు.తెలుగు వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కస్తూరిపై ఆలిండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు సీఎంకే రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు
సినీ నటి కస్తూరిపై కేసు నమోదు చేశారు.తెలుగు వారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కస్తూరిపై ఆలిండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షుడు సీఎంకే రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగాచెన్నై ఎగ్మోర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. నాలుగు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు.
ఓ రాజు అంత:పురంలో పనిచేసే మహిళలకు సేవ చేసేందుకు వచ్చినవారే తెలుగువారని కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై తమిళనాడులోని తెలుగు సంఘాలు మండిపడ్డాయి. సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాను చేసిన వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆమె చెప్పారు. తన వ్యాఖ్యలను డీఎంకే నాయకులు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆమె వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలతో తెలుగు ప్రజలను కించపర్చడం ఉద్దేశ్యం కాదని ఆమె చెప్పారు. నవంబర్ 3న తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.