లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు.. రూ.70 లక్షల ఖర్చును 95 లక్షలకు...

Lok Sabha - Assembly: కేంద్ర పాలిత ప్రాంతాల్లో రూ.54 లక్షల నుంచి 75 లక్షలకు పెంపు...

Update: 2022-01-07 02:35 GMT

లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు.. రూ.70 లక్షల ఖర్చును 95 లక్షలకు...

Lok Sabha - Assembly: పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి వ్యయ పరిమితిని పెంచారు. అభ్యర్థుల కోసం ఎన్నికల వ్యయ పరిమితిలో చివరి ప్రధాన సవరణ 2014లో జరిగింది. ఇది 2020లో మరో 10 శాతం పెరిగింది. ఇందుకోసం ఎన్నికల సంఘం పదవీ విరమణ పొందిన హరీశ్‌కుమార్‌తో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సులను ఆమోదించిన కమిషన్ అభ్యర్థులకు ప్రస్తుతం ఉన్న ఎన్నికల వ్యయ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

లోక్‌సభ ఎన్నికల్లో 70 లక్షలుగా ఎన్నికల ఖర్చును 95 లక్షలకు పెంచారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 54 లక్షల నుంచి 75 లక్షలకు పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో 28 లక్షలుగా ఉన్న రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలను 40 లక్షలకు పెంచారు. 20 లక్షలు ఉన్న రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 28 లక్షలకు పెరిగింది.

Tags:    

Similar News