BCCI: పొగాకు, మద్యం సంబంధిత ప్రకటనలపై కేంద్రం చర్యలు

BCCI: బీసీసీఐ, శాయ్‌లకు సూచనలు చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

Update: 2024-08-02 12:10 GMT

BCCI: పొగాకు, మద్యం సంబంధిత ప్రకటనలపై కేంద్రం చర్యలు

BCCI: లక్షలాదిమందికి రోల్‌ మోడల్స్‌గా నిలిచే క్రీడాకారులు పొగాకు, మద్యం సంబంధిత ప్రకటనలు చేయకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. ఈ మేరకు BCCI, భారత క్రీడా ప్రాధికార సంస్థలకు సూచనలు చేసింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి క్రికెటర్లు, అథ్లెట్లు మార్గదర్శకులని పేర్కొంది. BCCI అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, శాయ్‌ డైరక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ సందీప్ ప్రధాన్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ డైరక్టర్‌ అతుల్ గోయల్‌ లేఖ రాశారు. ఐపీఎల్‌ సహా ఇతర క్రికెట్‌ మ్యాచ్‌ల సమయంలో పొగాకు, ఆల్కహాల్‌ ప్రకటనలు చేస్తున్నారని అని కేంద్రం పేర్కొంది.

ప్రముఖ క్రికెటర్లు యాడ్స్‌లో కనిపించడంతో యువతపై దుష్ప్రభావం పడే అవకాశం లేకపోలేదని తెలిపింది. సంబంధిత అంశంపై BCCI దృష్టిసారించాలని కోరింది. ఇలాంటి ప్రకటనల్లో క్రికెటర్లు పాల్గొనకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. బీసీసీఐ నిర్వహించే మ్యాచ్‌లు, ఐపీఎల్‌ టోర్నీ సమయంలో క్రికెటర్లు మాత్రమే కాకుండా... ఇతర ప్రముఖులు ఎవరైనా సరే పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్‌ ప్రకటనలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలి అని కేంద్రం కోరింది.

Tags:    

Similar News