Top 6 News @ 6PM: తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు.. రైతులకు ఖాతాల్లోకి కేంద్రం డబ్బులు.. మరో టాప్ 4 న్యూస్ హెడ్‌లైన్స్
1) సబర్మతి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ ఖర్చెంత? మూసీ సుందరీకరణ బడ్జెట్ ఎంత?
సబర్మతి రివర్ ఫ్రంట్ ను మోడీ కట్టుకోవచ్చు...కానీ మూసీ రివర్ ఫ్రంట్ తెలంగాణలో ఎందుకు వద్దంటున్నారని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు. మూసీ పేరుతో ఎంతకాలం రాజకీయం చేస్తారని ఆయన విపక్షాలను నిలదీశారు. మూసీ వెంట ఇళ్ల కూల్చివేతలను బాధితులు సమర్థిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ కు ఈటల సవాల్ విసిరారు. పూర్తి విశ్లేషణాత్మక వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2) బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు..ఐఎండీ వార్నింగ్
తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని..దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రభావంత ఏపీ, తెలంగాణలో బారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ కు చేరువగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్ తోపాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు ఉంటుందని అంచనా వేసింది ఐఎండీ. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) ఈడీ చేతికి గొర్రెల స్కామ్ నివేదిక
గొర్రెల స్కాంలో అర్హులైన లబ్దిదారుల జాబితా ఈడీకి అందింది. పశు సంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ తో పాటు మోహినొద్దిన్, ఇక్రముద్దీన్ కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంది.ఈడీ అధికారులు తెలంగాణలో గొర్రెల స్కాంపై జూన్ 13, 2024న కేసు నమోదు చేశారు. ఈ స్కీంలో లబ్దిదారులు, గొర్రెల విక్రయదారులు, రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు పశుసంవర్ధకశాఖాధికారులను కోరారు. ఈడీ అధికారుల అభ్యర్థన మేరకు జిల్లాల వారీగా లబ్దిదారుల వివరాలను అధికారులు అందించారు. అయితే ఈ జాబితా ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఇందులో మనీలాండరింగ్ జరిగిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసును విచారించాలని ఈడీని కోరారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) బిగ్ షాక్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై కేసు నమోదు?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఊహించని విధంగా షాక్ తగిలినట్లు సమాచారం. పవన్ లడ్డూ వివాదం, సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. శుక్రవారం తిరుపతిలో సనాతన ధర్మంపై వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించిన పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై సంచలన కామెంట్స్ చేశారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మించలేదని..అలా ఎవరైనా ప్రయత్నించినట్లయితే మీరే కొట్టుకుపోతారంటూ వ్యాఖ్యానించారు.
తాను సనాతన హిందువుని..అలాంటి వ్యక్తులు రావచ్చు..పొవచ్చు అన్నారు. కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచే ఉంటుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంపై సైతం ఆయన తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కు పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ అని దాన్ని నిర్మూలిస్తామని కొందరు అంటున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం.. జగన్ సర్కార్ తీసుకొచ్చిన మరో విధానం రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. దాంతో మళ్లీ పాత పద్ధతిలోనే టెండరింగ్ విధానం అమల్లోకి రానుంది. కాగా, మునుపటి జగన్ ప్రభుత్వం 2019లో రివర్స్ టెండర్ విధానం అమలుకు జీవో నెంబర్ 67 తీసుకొచ్చింది.
టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన వెంటనే ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం. అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో టీటీడీ అధికారులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు.
6) PM KISAN 2024 October: రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు జమ.. ఎలా చెక్ చేసుకోవాలంటే..
పీఎం కిసాన్ పథకంలో భాగంగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ 18వ ఇన్‌స్టాల్మెంట్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి నుండే పిఎం కిసాన్ పథకం డబ్బులు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఒక్కో రైతుకు రూ. 2,000 చొప్పున కేంద్రం తరపున ఆర్థిక సాయం జమ కానుంది. ఈ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం కేంద్రం రూ. 20 వేల కోట్ల నిధి కేటాయించింది. పిఎం కిసాన్ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 17 విడతల్లో ఆర్థిక సాయం అందించారు. నేటితో రైతుల ఖాతాల్లో 18వ విడత పెట్టుబడి సాయం డబ్బులు జమ అవడం మొదలైంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.