చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్ 31 మావోల మృతి: 48 గంటల ముందే పోలీసుల పక్కా ప్లాన్

తూర్పు బస్తర్ డివిజన్ దళాలు గవాడి, థుల్ థులి, నెందూర్, రెంగవయా గ్రామాల్లో మావోయిస్టులు సమావేశమయ్యారని కచ్చితమైన సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు పక్కాగా ప్లాన్ చేశాయి.

Update: 2024-10-05 14:16 GMT

చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్ 31 మావోల మృతి: 48 గంటల ముందే పోలీసుల పక్కా ప్లాన్

ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ-నారాయణ్ పుర్ సరిహద్దులో అక్టోబర్ 4న జరిగిన ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అక్టోబర్ 3న పోలీసులు ఈ ఆపరేషన్ ను ప్రారంభించారు. ఈ ఆపరేషన్ కోసం 48 గంటలు శ్రమించారు. మావోయిస్టుల సమావేశం గురించి కచ్చితమైన సమాచారం ఆధారంగా పోలీసులు ప్లాన్ చేశారు.

బైక్ లపై  ప్రయాణం

తూర్పు బస్తర్ డివిజన్ దళాలు గవాడి, థుల్ థులి, నెందూర్, రెంగవయా గ్రామాల్లో మావోయిస్టులు సమావేశమయ్యారని కచ్చితమైన సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు పక్కాగా ప్లాన్ చేశాయి.అడవిలో మావోయిస్టుల కంటపడకుండా ఎత్తైన కొండ ప్రాంతంలో 10 కిలోమీటర్లు బైక్ లపై ప్రయాణించారు.

ఆ తర్వాత 12 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. నక్సలైట్లు సమావేశమైన ప్రదేశానికి చేరుకున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయని దంతెవాడ ఎస్పీ ఆర్కే బర్ మన్ మీడియాకు చెప్పారు. ఈ కాల్పుల్లో ఆపరేషన్ కు ఓ జవాన్ ను గాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన ఎన్ కౌంటర్ లో పీపుల్స్ గెరిల్లా ఆర్మీకి చెందిన వారుగా ఆయన చెప్పారు.తాజా ఎన్ కౌంటర్ తో బస్తర్ రీజియన్ లో ఈ ఏడాది మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 188కి చేరింది. చివరిగా ఏప్రిల్ 16న కాన్కేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మృతి చెందారు.

Tags:    

Similar News