Dantewada Encounter: రక్తమోడిన దండకారణ్యం..భారీ ఎన్‌కౌంటర్..36 మంది మావోయిస్టులు హతం
Dantewada Encounter: దంతెవాడ రక్తమోడింది. కాల్పుల మోతతో దంతెవాడ సరిహద్దు దద్దరిల్లింది. భారీ సంఖ్యల మావోయిస్టులు మరణించారు. మరోసారి బలగాలు, మావోల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో భారీ సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
Dantewada Encounter: ఛత్తీస్ గఢ్ దంతేవాడ అనగానే మావోయిస్టులు, బలగాల కాల్పుల మోతలు గుర్తుకువస్తాయి. ఒకసారి బలగాలు, మరోసారి మావోలు ఇలా ప్రాణాలు గాల్లో కలుస్తుంటాయి. తాజాగా మరోసారి ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు కనిపించడంతో భద్రతా బలగాలు ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. అటు నుంచి మావోయిస్టులు కూడా కాల్పులకు పాల్పడ్డారు. రెండువైపుల కాల్పులు జరిగాయి. ఈ దాడిలో మావోయిస్టులు భారీ సంఖ్యలో మరణించారు. ఘటనాస్థలంలో భారీ సంఖ్యలో ఏకే 47 రైఫిల్లు, అస్సాల్ట్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి.
డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ కలిసి యాంటీ మావోయిస్టు ఆపరేషన్ ను గురువారం నిర్వహించాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.30 సమయంలో దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులో మావోయిస్టులు బలగాలకు ఎదురుపడ్డారు. దీంతో వారిద్దరి మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ మధ్య కాలంలో భద్రతా దళాల భారీ విజయంగా దీన్ని చెబుకుంటున్నారు.
సరిహద్దు దగ్గరకు భారీ సంఖ్యలో మావోయిస్టులు వచ్చినట్లు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక టీములుగా విడిపోయారు. గురువారం జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. గోవెల్, నెందూర్, థుల్ థులీ గ్రామాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ ప్రాంతాలు ఓర్చా, బర్సూర్ పోలీస్ స్టేషన్స్ పరిధిలోని నెందూర్ థుల్ థులీకి దగ్గరలోని అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ తర్వాత కొంతమంది మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు.