Supreme Court: ఎస్సీ వర్గీకరణ తీర్పుపై రివ్యూ పిటిషన్లు తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
Supreme Court: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో దాఖలైన రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది ధర్మాసనం.
Supreme Court: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో దాఖలైన రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది ధర్మాసనం. ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఈ ఏడాది ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆరుగురు సభ్యులు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువరించారు.
అయితే వర్గీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీర్పును రివ్యూ చేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. రివ్యూ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తాము ఇచ్చిన తీర్పులో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. తీర్పును పున:సమీక్ష చేయాల్సిన అవసరం లేదని వెల్లడిస్తూ పిటిషన్లను తోసిపుచ్చింది.