కోల్‌కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక పరిణామం

Sanjay Roy: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు గతంలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

Update: 2024-09-06 10:28 GMT

కోల్‌కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక పరిణామం

Sanjay Roy: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు గతంలో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని విచారణలో సీబీఐ గుర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిందితుడు సంజయ్‌రాయ్‌ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారించినట్లు తెలుస్తోంది. మరోవైపు కేసు దర్యాప్తు కూడా తుది దశకు చేరుకుందని, త్వరలో కోర్టులో సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్టు సమాచారం.

ఇప్పటి వరకు లభించిన ఆధారాలను నిందితుడి DNAతో సరిపోల్చడానికి సీబీఐ వాటిని ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి పంపించారు. ఎయిమ్స్‌ వైద్యుల నుంచి నివేదిక రాగానే సీబీఐ దర్యాప్తును పూర్తి చేయనుందట. ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు వందకుపైగా వాంగ్మూలాలను, 10 లై డిటెక్టర్‌ పరీక్షలను నిర్వహించింది. మరోవైపు జస్టిస్ ఫర్ అభయ అంటూ..బెంగాల్‌లో ఇంకా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. 

Tags:    

Similar News