Top 6 News Of The Day: సోమవారం స్కూళ్లకు, కాలేజీలకు సెలవు, గణేష్ నిమజ్జనం-ట్రాఫిక్ ఆంక్షలు.. మరో 4 టాప్ న్యూస్

Update: 2024-09-15 12:39 GMT

1) గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల ఆంక్షలు.. ఎవరెవరు ఏయే రూట్‌లో వెళ్లాలంటే..

భాగ్యనగర వీధుల్లో ఎటు చూసినా గణనాథుల సందడే కనిపిస్తుంది. ఇన్నిరోజులు గణపతి బప్పా మోరియా అంటూ పలికిన భక్తులు, ఇప్పుడు గణేషుడికి బైబై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. 9 రోజుల పాటు మండపాల్లో విశేష పూజలందుకున్న గణనాథులు ట్యాంక్‌బండ్ వైపు కదిలిరానున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనాలను సంబంధించిన రూట్ మ్యాప్‌ను హైదరాబాద్ పోలీసులు విడుదల చేశారు. ఏయే రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టత ఇచ్చారు. పోలీసుల ఆంక్షలను ఫాలో అవుతూ వినాయక ప్రతిమలను తరలించాలని సూచించారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) రైతులకు శుభవార్త.. త్వరలోనే అకౌంట్లోకి రూ.10వేలు జమ ..మంత్రి కీలక ప్రకటన

ఈ మధ్యే భారీ వర్షాలు, వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి. తెలంగాణలో చాలా వరకు పంటలు వరదలకు గురయ్యాయి. దీంతో పంటలు నష్టపోయిన రైతులకు ఆదుకుని, వారికి బాసటగా నిలించేందుకు తెలంగాణ సర్కార్ ముందుకు వచ్చింది. పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ. 10,000 చొప్పున జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. వరదల కారణంగా రాష్ట్రంలో రూ. 10వేల కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. పూర్తి వార్తాకథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) నందిగం సురేష్‌కి పోలీసుల ప్రశ్నలు

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. పోలీసు కస్టడికి అనుమతిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన్ని విచారించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి 17వ తేదీ మంగళవారం మధ్యాహ్నం వరకు మంగళగిరి రూరల్ స్టేషన్‌లో ఈ విచారణ కొనసాగనుంది. రెండు రోజులు విచారణ అనంతరం నందిగం సురేష్‌ని మళ్లీ గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారు.

4) విద్యార్థులకు మరో గుడ్ న్యూస్.. సోమవారం స్కూళ్లకు, కాలేజీలకు సెలవు

విద్యార్థులకు అదిరే వార్త. వరుసగా రెండు రోజులు సెలువలు వస్తున్నాయి. సోమవారం పాఠశాలలకు, కాలేజీలకు సెలవును ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏపీ ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థులు సంతోషంలో మునిగితేలుతున్నారు. ఇవాళ ఆదివారం, రేపు సోమవారం సెలవు కావడంతో విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. మళ్లీ ఏపీలో మంగళవారం పాఠశాలలు తెరచుకుంటాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) అందరూ చూస్తుండగానే స్టేజ్‌పై ఉన్న సీఎం వద్దకు పరిగెత్తాడు.. అంతా షాక్!

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆదివారం ఊహించని అనుభవం ఎదురైంది. సిద్ధరామయ్య ఒక బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా వేదికపై కూర్చున్నారు. అదే సమయంలో స్టేజీకి ముందు భాగంలో కూర్చున్న ఒక 24 ఏళ్ల యువకుడు ఉన్నట్లుండి ముఖ్యమంత్రి వైపు పరుగులుతీశారు. దాదాపు ఒక్క గెంతులో వేదికపైకి ఎక్కారు. మరో ఒకట్రెండు అడుగుల్లో అతడు సీఎం సిద్ధరామయ్యను చేరుతారనగా వెంటనే అక్కడే ఉన్న సీఎం సెక్యురిటీ విభాగం అప్రమత్తమైంది. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన.. తరువాతి ప్లాన్ ఏంటి, కొత్త సీఎం ఎవరు?

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. మరో రెండు రోజుల తరువాత తాను తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలు తనకు మళ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఇచ్చే వరకు ఆ సీటులో కూర్చోబోనని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. అప్పటివరకు తాను వీధివీధి తిరుగుతూ ప్రజలను కలుస్తానని అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలే తమకు ప్రజల నుండి మద్దతును తీసుకొస్తాయని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తంచేశారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News