Arvind Kejriwal: సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పీఏసీ సమావేశం

Arvind Kejriwal: సీఎం పదవికి రాజీనామా చేస్తానన్న కేజ్రీవాల్

Update: 2024-09-16 07:15 GMT

Arvind Kejriwal: సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ పీఏసీ సమావేశం

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం పదవికి రాజీనామ చేస్తానన్న కేజ్రీవాల్ స్టేట్‌మెంట్‌తో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో తదుపరి సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కానుంది.

ఢిల్లీ సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనే దానిపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో ఆప్ నేత మనీష్ సిసోడియా సమావేశమయ్యారు. కొత్త ముఖ్యమంత్రి పేరుపై చర్చ జరిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News