సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్‌లపై వేటు

Border Security Force: భారత్‌లోకి చొరబాట్లు సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-03 06:06 GMT

సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్‌లపై వేటు

Border Security Force: భారత్‌లోకి చొరబాట్లు సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్‌, బీఎస్ఎఫ్‌ డిప్యూటీ స్పెషల్ డీజీ ఖురానియాపై వేటు వేసింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ వారిని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలగింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

1989 బ్యాచ్‌ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన నితిన్ అగర్వాల్.. గతేడాది జూన్‌లో బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1990 బ్యాచ్ ఒడిశా కేడర్‌కు చెందిన ఖురేనియా ప్రత్యేక డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు అధికారుల మధ్య సమన్వయ లోపాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పలు కీలక అంశాల్లో నితిన్ అగర్వాల్‌పై ఫిర్యాదులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇద్దరు అధికారులకు బీఎస్‌ఎఫ్‌పై నియంత్రణ లేకపోవడం, ఇతర ఏజెన్సీలతో సమన్వయం లేకపోవడంతో విధుల నుంచి తప్పించిన కేబినెట్ కమిటీ.. రాష్ట్ర కేడర్‌కు పంపించింది. ఇటీవల చొరబాట్లు, ఉగ్రదాడులు పెరగడానికి సమన్వయ లోపమే కారణమని భావిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

Tags:    

Similar News