BRS Maharashtra: ఈ నెల 6న ఎన్సీపీలో బిఆర్ఎస్ విలీనం

BRS Maharashtra: బీఆర్ఎస్ ( భారత రాష్ట్ర సమితి )మహారాష్ట్ర శాఖ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. అక్టోబర్ 6వ తేదీన పుణెలో జరిగే కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సమక్షంలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ విలీనం కావడం లాంఛనమైందని తెలుస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావడంమే లక్ష్యంగా ఎన్సీపీ ముందుకు సాగుతోంది.

Update: 2024-10-02 05:00 GMT

BRS Maharashtra: ఈ నెల 6న ఎన్సీపీలో బిఆర్ఎస్ విలీనం

BRS Maharashtra: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కొద్ది రోజుల్లోనే మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాలు చేసేందుకు రంగంలోకి దిగిన కేసీఆర్  మహారాష్ష్ర పై పెద్దెత్తున ఫోకస్ పెట్టారు. అంతేకాదు మహారాష్ట్రలో పార్టీని సైతం ఏర్పాటు చేశారు.

ఎన్నోసార్లు మహారాష్ట్రలో బహిరంగ సభలను కూడా నిర్వహించారు. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. దీంతో అప్పటి నుంచి కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి నోరుమెదపలేదు. ఇప్పటి వరకు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టలేదు. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి పక్క పార్టీలవైపు వెళ్లేలా చేసింది. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని బీఆర్ఎస్ నాయకులు శరద్ పవార్ ఆధ్వర్యంలో ఎన్సీపీలో చేరి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయనున్నారు.

తాజాగా మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు శరద్ పవార్ తో కీలక భేటీ నిర్వహించారు. అనంతరం అక్టోబర్ 6వ తేదీన పూణేలో ఎన్సీపీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా మూకుమ్మడిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. పార్టీని  ఎన్ సీ పీలో విలీనం చేయనున్నారు.

Tags:    

Similar News