Kangana Ranaut: ఎంపీ కంగనారనౌత్‌కు బీజేపీ హైకమాండ్ షాక్

Kangana Ranaut: పార్టీ పాలసీపై మాట్లాడే అధికారం, అనుమతి లేదన్న అధిష్టానం

Update: 2024-08-26 14:59 GMT

Kangana Ranaut: ఎంపీ కంగనారనౌత్‌కు బీజేపీ హైకమాండ్ షాక్

Kangana Ranaut:ఎంపీ కంగనారనౌత్‌కు బీజేపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. పార్టీ పాలసీపై మాట్లాడే అధికారం, అనుమతి లేదని అధిష్టానం స్పష్టం చేసింది. రైతుల ఉద్యమానికి సంబంధించిన ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో.. బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది..

రైతుల ఉద్యమంలో విదేశాల కుట్ర ఉందని..వారిని అదుపు చేయకపోతే బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు వస్తాయన్నారామె. దీంతో విపక్షాలు కంగనా కామెంట్స్ కేంద్రంగా..బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించాయి. కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ కూడా చేశాయి. కంగనా కామెంట్స్ దుమారం రేపడంతో..అప్రమత్తమైన బీజేపీ హైకమాండ్..పార్టీ పాలసీపై మాట్లాడే అధికారం, అనుమతి లేదని స్పష్టం చేసింది..

Tags:    

Similar News