PM Modi: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ కీలక అడుగులు
PM Modi: కేబినెట్ విస్తరణకు ప్రణాళికలు పూర్తి చేసిన బీజేపీ * రెండు మూడు రోజుల్లో కేబినెట్‌ను విస్తరించే అవకాశం
PM Modi: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల బీజేపీ కీలక అడుగులు వేస్తోంది. నెల రోజులుగా పార్టీలో మార్పులు.. కేబినెట్ విస్తరణపై జరుపుతున్న సమావేశాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర కేబినెట్‌ను విస్తరణకు ఈ నెలలోనే ముహూర్తం ఫిక్స్ అయ్యే చాన్స్ ఉంది. మరో రెండు మూడు రోజుల్లోనే కేబినెట్‌ను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత కేబినెట్‌లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. కేంద్ర కేబినెట్ సంఖ్య 81 అయితే.. ప్రస్తుతం 53 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మిగతా 28 మందిని త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర వహించిన జ్యోతిరాధిత్య సింధియా.. హిమంత్ బిశ్వ శర్మ కోసం కుర్చీ వదులుకున్న మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌లకు ఈ విస్తరణలో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనుండటంతో.. ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక బిహార్‌కు కూడా కేబినెట్‌లో అధిక ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి. ఆ రాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ మోదీని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఎల్‌జేపీ నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వనున్నారట. ఎల్‌జేపీ మాజీ అధినేత రాం విలాశ్ పాశ్వాన్ మరణంతో కేంద్ర కేబినెట్‌లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే చిరాగ్ పాశ్వాన్‌కు అవకాశం కల్పిస్తారా లేదంటే రాం విలాస్ తమ్ముడు పశుపతి పారస్‌కు అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి. ఇక 2019 ఒకే మంత్రి పదవి రావడంలో కేంద్ర కేబినెట్‌లో చేరకుండా అలకపూని.. చాలా కాలానికి ఒప్పుకున్న నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి కూడా అవకాశం దక్కనున్నట్లు సమాచారం.