Bird Flu in India: భారత్‌లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్
Bird flu in India: * దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ * బర్డ్ ఫ్లూతో హర్యానాలో 10 రోజుల్లో 4 లక్షల కోళ్లు మృతి * వేలాది కోళ్లు, బాతులను చంపేస్తున్న కేరళ ప్రభుత్వం
Bird flu in ఇండియా దేశంలో బర్డ్ ఫ్లూ మరోసారి పంజా విసురుతోంది. నిన్నమొన్నటి వరకు రాజస్థాన్ లోని 11 జిల్లాల్లో 425 కాకులు హెచ్5ఎన్ 1 వైరస్ బారిన పడి మృతి చెందాయి.. హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోనూ కాకులు, బాతుల్లో బర్డ్ ఫ్లూ నిర్దారణ అయినట్టు తెలుస్తోంది. కరోనా కలవరం సద్దుమణక ముందే కేరళపై బర్డ్‌ఫ్లూ వైరస్ దాడి చేసింది.
కేరళలోని అలప్పుళ, కొట్టాయం జిల్లాల్లో ఈ వైరస్ ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు దాదాపు 12 వేల బాతులు చనిపోయినట్టు తెలుస్తోంది. వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో మరో 36 వేల బాతులను చంపేయాల్సి రావచ్చని అధికారులు అంటున్నారంటే ఈ ఫ్లూ తీవ్రత ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు.
అయితే చనిపోయిన 8బాతుల నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపగా.. 5 బాతుల్లో వైరస్‌ను గుర్తించారు. అటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఈ వైరస్ కల్లోలం రేపుతోంది. ఏటా ఈ సీజన్ లోమధ్య ఆసియా, రష్యా, మంగోలియా నుంచి దాదాపు లక్షలాది వలస పక్షులు వస్తాయి వాటితోనే ఈ వైరస్ వచ్చినట్టు తెలుస్తోంది..
చనిపోయిన 8 బాతుల నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపగా.. 5 బాతుల్లో వైర్‌సను గుర్తించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా ఈ వైరస్ కల్లోలం రేపుతోంది. ఏటా ఈ సీజన్‌లో మధ్య ఆసియా, రష్యా, మంగోలియా నుంచి దాదాపు లక్ష వలస పక్షులు వస్తాయి. గత నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 వేల పక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సోమవారం బయటపడ్డ బర్డ్‌ఫ్లూ కేసులు కూడా వలసపక్షుల్లో బయటపడడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం 2,401 పక్షులు బర్డ్‌ఫ్లూ బారిన పడి చనిపోయాయని, వాటిల్లో 90% పొడుగు మెడ బాతు జాతికి చెందిన వలస పక్షులని అధికారులు తెలిపారు. కంగ్రా జిల్లాలోని పాంగ్ డ్యామ్ సమీపంలో పక్షుల మరణాలు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారె్‌స్టస్ (వైల్డ్‌లైఫ్) అర్చన శర్మ వెల్లడించారు. చనిపోయిన పక్షులను 'బర్డ్‌ఫ్లూ ప్రొటోకాల్' మేరకు దహనం చేస్తున్నట్లు వివరించారు. దీంతో కంగ్రా కలెక్టర్ రాకేశ్ ప్రజాపతి పాంగ్ డ్యామ్ పరిసరాల్లో కిలోమీటరు దూరం వరకు పర్యాటకులపై నిషేధం విధించారు.
ఫతేపూర్, డెహ్రా, జవాలీ, ఇండోరా డివిజన్లలో పక్షుల వధ, కోళ్లు, ఇతర పక్షుల మాంసం, చేపల విక్రయాలపై, ఎగుమతులపై నిషేధాజ్ఞలను ప్రకటించారు. పాంగ్ డ్యామ్ సమీపంలో ఉన్న 'గోపాల్‌పూర్ జూపార్క్'లో హైఅలెర్ట్ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో కూడా బర్డ్‌ఫ్లూ కలకలం నెలకొంది. ఇండోర్‌లో 50 కాకులు చనిపోయాయని, వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపగా బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ లో నేలరాలుతున్న కాకులు...
దేశంలో కరోనా వైరస్ కు పోటీనా అన్నట్టు బర్డ్ ఫ్లూ క్రమంగా వ్యాపిస్తోంది. మధ్యప్రదేశ్ లో కాకుల పాలిట మృత్యుగీతం ఆలపిస్తున్న ప్రమాదకర ఏవియన్ ఫ్లూ ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లోనూ పక్షులు బర్డ్ ఫ్లూ కారణంగా నేలరాలుతున్నాయి.
బర్డ్ ఫ్లూ కారణంగా వందల సంఖ్యలో కాకులు మృతి చెందుతుండడంతో మధ్యప్రదేశ్ అధికార వర్గాలు అప్రమత్తం అయ్యాయి. మధ్యప్రదేశ్ లోని మందసౌర్ ప్రాంతంలో 24 గంటల వ్యవధిలో 100 కాకులు మృత్యువాత పడ్డాయి. దాంతో ఆ ప్రాంతంలో చికెన్ షాపులు మూసివేశారు. 15 రోజుల వరకు తెరవకూడదని అధికారులు ఆదేశించారు. అంతేకాదు, కోడిగుడ్ల అమ్మకాలపైనా నిషేధం విధించారు.
కేరళలోనూ దీని తీవ్రత హెచ్చుస్థాయిలో ఉంది. కొట్టాయం, అళప్పుజ ప్రాంతాల్లో 12 వేల బాతులు బర్డ్ ఫ్లూ కారణంగానే చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. వేల సంఖ్యలో బాతులు మృతి చెందే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే బర్డ్ ఫ్లూ పాకిపోతుండడడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అటు, బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇండోర్ నగరంలో చనిపోయిన కాకుల్లో ఏవియన్ ఇన్ ఫ్లుయెంజాను గుర్తించినట్టు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ వెల్లడించారు.