అట్టుడుకుతున్న బీహార్.. రైళ్లకు నిప్పంటించిన విద్యార్థులు

Protests in Bihar: బీహార్ రాష్ట్రం అట్టుడుకుతోంది. రైల్వే ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.

Update: 2022-01-26 10:37 GMT

అట్టుడుకుతున్న బీహార్.. రైళ్లకు నిప్పంటించిన విద్యార్థులు

Protests in Bihar: బీహార్ రాష్ట్రం అట్టుడుకుతోంది. రైల్వే ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అభ్యర్థులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. యువత ఆందోళనతో బీహార్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి అభ్యర్థులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. విద్యార్థుల నిరసనతో బీహార్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

జెహానాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను రైల్వే ట్రాక్‌పై దగ్ధం చేసి నిరసన తెలియజేశారు విద్యార్థులు. సీతామర్హిలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టారు. బీహార్‌లోని పాట్నా, నవాడా, ముజఫర్‌పూర్, సీతామర్హి, బక్సర్, భోజ్‌పూర్ తదితర జిల్లాలు ఆందోళనలతో అట్టుడికాయి. 

Tags:    

Similar News