బిహార్‌లో మోగిన ఎన్నికల నగారా
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది. అక్టోబర్..
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీల్లో మూడు దశల్లో జరుగుతాయని, నవంబర్ 10 న ఫలితాలు ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రపంచవ్యాప్త కరోనావైరస్ సంక్షోభం మధ్య జరిగే మొదటి ప్రధాన ఎన్నిక ఇది. శుక్రవారం ఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఈసీ సునీల్ ఆరోరా ఈ ఎన్నికల షెడ్యూల్ వివరాలు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
బహిరంగ సభలు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరించింది. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కాగా నవంబర్ 29 లోగా బీహార్ లో మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సునీల్ అరోరా ఈ ఎన్నికలను "చారిత్రాత్మక ఎన్నికలు" గా అభివర్ణించారు. బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ఎన్నికలలో నాలుగోసారి పోరాడనున్నారు. ఇటు ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు తమకు ఖచ్చితంగా అధికారం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.