బీహార్ లో బీజేపీకి షాక్.. పార్టీని వీడిన కీలకనేతలు

అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ లో బిజెపికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలకనాయకురాలు, మాజీ ఎమ్మెల్యే ఉషా విద్యార్తి ఆ పార్టీకి రాజీనామా చేశారు..

Update: 2020-10-07 11:15 GMT

అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ లో బిజెపికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలకనాయకురాలు, మాజీ ఎమ్మెల్యే ఉషా విద్యార్తి ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం చిరాగ్ పాస్వాన్‌ను కలిసి బుధవారం లోక్ జనశక్తి పార్టీలో చేరారు, అంతేకాదు జెడియు కూడా పోటీ చేసే పాలిగంజ్ అసెంబ్లీ నియోగాజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. బీజేపీ నుంచి పాలిగంజ్ అసెంబ్లీ సీటును ఆశించిన ఉషా విద్యార్తి పొత్తులో భాగంగా ఆ సీటును జేడీయూకు ఇచ్చారు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఉషా విద్యార్తి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బీజేపీనేత సుశీల్ కుమార్ మోదీ ఉషా విద్యార్తిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. అయినా ఆయన మాట వినలేదు..

ఈ ఉదయం లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ తో భేటీ అయ్యారు.. అనంతరం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఎన్నో రోజులుగా బీజేపీలో ఉన్న తనకు సీటు ఇవ్వకుండా పొత్తులో భాగంగా తన సీటును జేడీయూకు కేటాయించడం తనకు చాలా బాధ కలిగించిందని ఆమె అన్నారు. అలాగే రాష్ట్రానికి చెందిన మరో సీనియర్ బిజెపి నాయకుడు రాజేంద్ర సింగ్ కూడా ఎల్జేపీ లో చేరారు. ఆయన దినారా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు, అయితే ఈ స్థానాన్ని జెడి (యు) కు కేటాయించడంతో పార్టీ మారారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జెడియు 122 సీట్లలో, బిజెపి 121 స్థానాల్లో పోటీ చేస్తుంది. మూడు దశల బీహార్ ఎన్నికలు అక్టోబర్ 28 నుంచి ప్రారంభమవుతాయి. 

Tags:    

Similar News