Mamata Banerjee : రాజీనామా చేసేందుకు నేను రెడీ..మమతా బెనర్జీ సంచలన ప్రకటన

Bengal CM Mamata Banerjee:బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ప్రజల కోసం తాను సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైద్యులతో చర్చలపై ప్రతిష్టంభన నెలకున్న నేపథ్యంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-13 02:45 GMT

CM Mamata: రాజీనామా చేసేందుకు నేను రెడీ..మమతా బెనర్జీ సంచలన ప్రకటన

Bengal CM Mamata Banerjee:బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం తన పదవిని వదులుకునేందుకు తాను రెడీగా ఉన్నట్లు తెలిపారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారాం, హత్య విషయం న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు దీదీ తెలిపారు.

ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనపై ప్రతిష్టంభన తొలగించేందుకు జూనియర్ వైద్యులతో తాను చర్చలు జరిపేందుకు మూడుసార్లు ప్రయత్నించానని తెలిపారు. వైద్యుల ఆందోళనల నేపథ్యంలో ఇప్పటి వరకు 27 మంది మరణించినట్లు తెలిపారు. 7లక్షల మంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మమతా బెనర్జీ తెలిపారు. ఆర్జీకర్ ప్రతిష్టంభన నేటితో ముగింపు లభిస్తుందని ఆశించిన బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెప్పారు.

కాగా ప్రస్తుతం ఈ కేసు ఈ కోర్టు పరిధిలో ఉంది. అందుకే జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేసినట్లు చర్యలను ప్రత్యక్ష ప్రసారం చేయలేము. అయితే ఈ భేటీ వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశాము. సుప్రీం అనుమతితో ఆ ఫుటేజీని వైద్యులకు అందిస్తాం. ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోను..పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమిస్తాను అంటూ సీఎం మమతా తెలిపారు.

ఇక ముఖ్యమంత్రితో జూనియర్ వైద్యుల చర్చల నేపథ్యంలో నాటకీ పరిణామాలు ఎదురయ్యాయి. సీఎంతో భేటీని లైవ్ లో టెలికాస్ట్ చేయాలని జూనియర్ వైద్యులు పట్టుబట్టారు. అలాగే 30 మంది వైద్యుల బ్రుందాన్ని చర్యలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం 15మందికే అనుమతి ఉందని చెప్పడంతో దానికి ఒప్పుకోని వైద్యులు తాము 30 మంది వెళ్తామని ప్రకటించారు. దీంతో చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది.

మరోవైపు వైద్యులతో భేటీ అయ్యేందుకు తాను దాదాపు 2 గంటలు వేచి చూసానని మమత తెలిపారు. ఈ నేపథ్యంలో డీజీపీ రాజీవ్ కుమార్, ఎడీజీ సుప్రతిమ్ సర్కార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ వైద్యుల బ్రుందంతో చర్చలు జరిపారు.


Tags:    

Similar News