Mamata Banrjee: దేశంలో రైలు ప్రమాదాలు సాధారణంగా మారాయి..దీదీ ఘాటు వ్యాఖ్యలు

Mamata Banrjee: హావ్ డా-ముంబై మెయిల్ రైలు ప్రమాద ఘటనపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈ ఘటన కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటూ మండిపడ్డారు. ప్రతివారం ఒక రైల్వే ప్రమాదం జరుగుతోంది. పట్టాలపై మరణాలు, ప్రయాణీకులకు గాయాలు ఎంతకాలం కొనసాగుతాయి? దీన్ని ఎంత కాలం సహిస్తాం?భారతప్రభుత్వానికి ఇలాంటి విషయాలు పట్టవా అంటూ ఫైర్ అయ్యారు.

Update: 2024-07-30 06:18 GMT

Mamata Banrjee : దేశంలో రైలు ప్రమాదాలు సాధారణంగా మారాయి..దీదీ ఘాటు వ్యాఖ్యలు

Jharkhand Train Mishap: దేశంలో తరచుగా జరుగుతున్న.. రైల్వే ప్రమాదాలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హావ్ డా-ముంబై మెయిల్ రైలు ప్రమాద ఘటనపై ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారత ప్రభుత్వం రైలు ప్రమాదాలను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రశ్నించింది. రైల్వే ప్రమాదాల్లో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని ఎస్పీ సుప్రీమో అఖిలేష్ యాదవ్ అన్నారు. జేఎంఎం, శివసేన కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి.

రైలు ప్రమాదాలు ఇప్పుడు రొటీన్ గా మారాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రతి వారం సంఘటనలు జరుగుతున్నాయి. ఇదేనా రూల్? ఉదయం మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ డివిజన్‌లో హౌరా-ముంబై మెయిల్ పట్టాలు తప్పింది.ఎంతో మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన చాలా విచారకరం. ప్రతివారం వరుసగా రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైలు పట్టాలపై ఈ మరణాలు.. ప్రయాణీకుల గాయాలు ఇంకా ఎంతకాలం కొనసాగుతాయి? దీన్ని ఎంతకాలం సహిస్తాం? భారత ప్రభుత్వ పట్టింపు లేదా అంటూ దీదీ ప్రశ్నించారు.

రైల్వే ప్రమాదాల్లో ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది: అఖిలేష్

ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హావ్ డా-ముంబై మెయిల్ రైలు ప్రమాద ఘటనపై స్పందించారు. ప్రభుత్వం ప్రతి రంగంలోనూ రికార్డు సృష్టించాలని భావిస్తున్నట్లు తెలుస్తోందంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పేపర్‌ లీక్‌ రికార్డు కొనసాగుతోంది. పేపర్ లీక్ తర్వాత రైల్వే ప్రమాదాల రికార్డు సృష్టిస్తోంది. భద్రత కోసం ఇంత భారీ బడ్జెట్ కేటాయిస్తున్నప్పటికీ .. రైల్వే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. సామాన్యులకు కనీస సౌకర్యాలు అందడం లేదు. ప్రమాదంలో చనిపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవడం లేదు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. వాయనాడ్ కొండచరియలు విరిగిపడటంపై కూడా అఖిలేష్ స్పందించారు. COP29, G20లలో గ్లోబల్ వార్మింగ్ గురించి ప్రభుత్వం గొప్పలు మాట్లాడిందన్నారు.

కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడ నిరంతరంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్‌లో రైలు ప్రమాదం తర్వాత, జార్ఖండ్ పాలక జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసింది. రైల్వే మంత్రి రీళ్ల తయారీని మానేసి రైల్వేపై దృష్టి సారించాలని జేఎంఎం తరపున సూచించారు.

Tags:    

Similar News