Mamata Banerjee: ప్రజా తీర్పు కాదు... మిషన్ల తీర్పు

Mamata Banerjee: అఖిలేష్ యాదవ్‌ను ఎన్నికల్లో ఓడేలా చేశారు

Update: 2022-03-11 13:00 GMT

యూపీ తీర్పుపై బెంగాల్ సీఎం మమత ఎద్దేవా

Mamata Banerjee: యూపీలో బీజేపీ గెలుపుపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. యూపీలో బీజేపీ ప్రజా తీర్పు ద్వారా గెలవలేదని... ఈవీఎంల వల్ల సాధించిందని ఎద్దేవా చేశారు. అఖిలేశ్ ఓడిపోయాలే బీజేపీ వ్యహం పన్నిందన్నారు. బీజేపీ గెలుపుపై మమత అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సిబ్బంది, కేంద్ర బలగాలతో బీజేపీ గెలిచిందని ధ్వజమెత్తారు. బీజేపీ గెలిచిన ఈవీఎంలపై ఫోరెన్సిక్ విచారణ జరిపించేలా చూడాలని అఖిలేష్ ను మమత కోరారు. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన అఖిలేశ్ బాధపడాల్సిన పనిలేదన్నారు మమత.

ఎన్నికల నిర్వహించిన ఈవీఎంలలో ప్రజలు ఓటేశారని రుజువుచేయాలన్నారు. బీజేపీ గెలిచింది ప్రజల వేసిన ఓట్లతో కాదంటూ మమత సంచలన ఆరోపణలు చేశారు.2024లో బీజేపీని ఎదుర్కోవాలంటే అన్ని పార్టీలు కలవాలని కాంగ్రెస్‌పై ఆధారపడే ప్రసక్తే లేదని మమత స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ విశ్వసనీయత కోల్పోతుందని ఆ పార్టీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలతో 2024 ప్రజల మూడ్ తెలుసిందని బీజేపీ చెప్పడం హ్యాస్యాస్పదమన్నారు మమత. బీజేపీ పగటి కలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. 

Tags:    

Similar News