అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేకతను చాటుకున్న చంద్రబాబు
Chandrababu: మానవవనరుల శక్తిని, నాలెడ్జ్ ఎకానమీని అనుసంధానం చేయాలి
Chandrababu Naidu: రాబోయే పాతికేళ్లలో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా వెలుగొందుతుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశానికి ఉన్న మానవ వనరుల శక్తి ని, నాలెడ్జ్ ఎకానమీ అనుసంధానించడంతో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. జీ 20 సమావేశాల సందర్భంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకతను చాటుకున్నారు.
అపార రాజకీయ అనుభవంతో మాట్లాడిన తీరుతో ఆకట్టకున్నారు. ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. దేశీయ ప్రగతి అంశాలను ప్రస్తావించి నాయకులను ఆలోచింపజేశారు. యువ శక్తి మన దేశానికి ఉన్న బలమని వారికి అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వ విధానాలకు రూపకల్పన జరగాలని సూచించారు. భారత్ దేశ భవిష్యత్ ప్రయాణంపై వచ్చే 25 ఏళ్లకు విజన్ డాక్యుమెంట్ సిద్దం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.