Bihar:బాబా సిద్దేశ్వర్ నాథ్ ఆలయంలో తొక్కిసలాట..ముగ్గురు మహిళలు సహా ఏడుగురు భక్తులు మృతి

Bihar: బీహార్‌లోని జెహనాబాద్‌లోని బాబా సిద్దేశ్వర్ నాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు భక్తులు మరణించారు. 35 మంది భక్తులు గాయపడ్డారు. ఈ ఘటన మఖ్దుంపూర్ బ్లాక్‌లోని వనవర్ పహాడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Update: 2024-08-12 02:29 GMT

Bihar:బాబా సిదేశ్వర్‌నాథ్ ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మహిళలు సహా ఏడుగురు భక్తులు మృతి

Baba Sideshwarnath Temple : బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో బాబా సిద్దేశ్వర్ నాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు భక్తులు మరణించారు.మరో 35 మంది భక్తులు గాయపడ్డారు. ఈ ఘటన మఖ్దుంపూర్ బ్లాక్‌లోని వనవర్ పహాడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. తొక్కిసలాట గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్య్కూ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలో వాలంటీర్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

నేడు శ్రావణ సోమవారం కావడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శివుని జలాభిషేకం సందర్భంగా ఆలయంలో తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా తోసుకుంటూ ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గాయపడిన భక్తులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆదివారం రాత్రి నుంచి సిద్దేశ్వర్ నాథ్ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని భక్తులు తెలిపారు. రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఆలయంలో ఉన్న భక్తులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడకు ఇక్కడకు పరుగులు తీయడం తీశారు. దీంతో చాలా మంది భక్తులు కిందపడటంతో గాయాలయ్యాయి. తొక్కిసలాట కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News