ఆ కార్డు ఉన్నవారికి గమనిక.. 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం..

Ayushman Bharat Yojana: పేద ప్రజలకి ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో మోదీ ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించారు.

Update: 2022-03-02 08:30 GMT

ఆ కార్డు ఉన్నవారికి గమనిక.. 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం..

Ayushman Bharat Yojana: పేద ప్రజలకి ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోదీ మూడు సంవత్సరాల క్రితం ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించారు. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ జాతీయ ఆరోగ్య అథారిటీ (NHA) వెబ్‌సైట్ ప్రకారం.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. దీనిలో 10.74 కోట్ల కంటే ఎక్కువ పేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు. ప్రతి కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల ఆరోగ్య రక్షణ లభిస్తోంది.

కోవిడ్ -19 కూడా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకంలో వర్తిస్తుంది. NHA వెబ్‌సైట్ ప్రకారం ఈ పథకంలో చేరినవారు ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా పరీక్ష, చికిత్స ఉచితంగా చేయించుకోవచ్చు. ఈ భీమా పథకం కింద. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకున్న చికిత్స ఖర్చులు కూడా చెల్లించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఆయుష్మాన్ భారత్ పథకం పాలక మండలి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్వేచ్ఛను ఇచ్చింది. ప్యానెల్ సూచన మేరకు రూ. 5 లక్షల వరకు లిస్టులో లేని శస్త్రచికిత్సలు కూడా బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది.

ఇది కాకుండా హెల్త్ బెనిఫిట్ ప్యాకేజీల (హెచ్‌బిపి) ధరలను రాష్ట్రాలు నిర్ణయించే అధికారం కల్పించింది. కార్డు హోల్డర్లకు వైద్య విధానాల జాబితా ఇచ్చారు. అందులో ఏరియాను బట్టి అందుబాటులో ఉన్న ప్యాకేజీని ఎంచుకోవచ్చు. కనీస వైద్య సదుపాయాలు పొందలేని కోట్లాది మంది భారతీయులు దీని కింద లబ్ధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు వారి ఆర్థిక స్థితిని బట్టి ఈ పథకంలోకి వస్తారు. అదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు వారి పని ఆధారంగా ఈ పథకంలోకి వస్తారు.

వికలాంగ సభ్యులు, SC/ST కుటుంబాలు, భూమిలేని కుటుంబాలు ఇందులో చేరవచ్చు. పట్టణాల్లో చెత్త వస్తువులను ఏరేవారు, బిక్షగాళ్లు, ఇంటి పని సహాయకులు, వీధి వ్యాపారులు, హాకర్లు, నిర్మాణ రంగ కార్మికులు, తాపీ పనివారు, పెయింటర్లు, వెల్డర్లు, సెక్యురిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు తదితర వర్గాల వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు.

Tags:    

Similar News