Schools Holidays: విద్యార్థులకు శుభవార్త..ఈనెల 21న స్కూల్స్ బంద్..ఎందుకంటే?

Schools Holidays: విద్యార్థులకు బంపర్ న్యూస్. ఈనెలలో మరో సెలవు రానుంది. ఎస్టీ, ఎస్సీ వర్గీకరణపై భారత్ బంద్ కు బహుజన సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో పాఠశాలలకు సెలవు రానుంది.

Update: 2024-08-04 04:07 GMT

 School Holidays

Bharat Bandh: ఆగస్టు నెలలో పండగలతోపాటు కొన్ని స్పెషల్ డేస్ రావడంతో పాఠశాలలకు భారీగా సెలవు వస్తున్నాయి. తాజాగా మరోసెలవు కూడా జత అయ్యింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొందరు హర్షిస్తుంటే..మరికొంతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బహుజన సంఘాల్లో తీవ్ర వ్యతిరేత వ్యక్తం అవుతోంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, రిజర్వేషన్ కేటగిరీలలో ఉపవర్గీకరణలను అనుమతిస్తూ ఈమధ్యే సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది.

ఈ రెండు వర్గాల్లో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనగా ఈనెల 21న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. భీమ్ సేన, ట్రైబల్ ఆర్మీ చీఫ్ పిలుపునకు పలు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీల్లోని ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడుతున్నాయి. దీంతో ఈనెల 21న దేశంలోని అన్ని పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది. దీంతో విద్యార్థులకు ఈ నెలలో అదనంగా మరో రోజు సెలవు జత కానుంది.

కాగా ఎస్సీ, ఎస్టీ వర్గకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా వ్యతిరేకించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలను మొదలవుతున్నాయి.


Tags:    

Similar News