బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం

* తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం దక్షిణ అండమాన్‌ సమీపంలో ఉపరితల ఆవర్తనం

Update: 2022-12-14 03:08 GMT

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Mandous: మండూస్ తుపాను తీరం దాటి బలహీనపడినప్పటికీ ఆ ప్రభావం ఇంకా ఏపీ, తెలంగాణలో కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. తుపాను పరిస్థితుల కారణంగా ఆగ్నేయ అరేబియా సముద్రంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా మారనున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. అంతేకాదు, ఇది మరింత బలపడి రేపటికి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీనికితోడు బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో సుమిత్ర జలసంధిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రెండుమూడు రోజుల్లో ఇది పశ్చిమంగా పయనించి శ్రీలంకకు సమీపంలో ఈ వారాంతంలో అల్పపీడనంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News