కేజ్రీవాల్‌కు అధికార మత్తు తలకెక్కిందన్న అన్నా హజారే

Anna Hazare: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అధికారం నిషా తలకెక్కిందని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే మండిపడ్డారు.

Update: 2022-08-30 14:43 GMT

కేజ్రీవాల్‌కు అధికార మత్తు తలకెక్కిందన్న అన్నా హజారే

Anna Hazare: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అధికారం నిషా తలకెక్కిందని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ ఇష్యూలో కేజ్రీవాల్‌తోపాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై అన్నా హజారే ఘాటుగా స్పందించారు. గతంలో అవినీతి వ్యతిరేక పోరాటంలో ఎత్తుకున్న ఆదర్శాలను గాలికి వదిలేశారంటూ కేజ్రీవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలకు వ్యతిరేకంగా మద్యం పాలసీ తీసుకొచ్చారని అన్నా హజారే విమర్శించారు. ఆనాడు స్థానికుల అనుమతి లేకుండా లిక్కర్ దుకాణాలు పెట్టొందంటూ స్వరాజ్ పుస్తకాన్ని తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక ఆ విషయాన్ని పెడచెవిన పెట్టారని అన్నా హజారే ఎద్దేవా చేశారు. లిక్కర్ లాగే అధికారం కూడా మత్తెక్కిస్తుందని విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మిగతా అన్ని పార్టీల్లాగే అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందని ఫైర్ అయ్యారు అన్నా హజారే.

Tags:    

Similar News