లవర్ కోసం హరియాణా నుంచి బెంగళూరు వచ్చాడు.. కట్‌చేస్తే.. ఊహించని షాకిచ్చిన పోలీసులు
Anirudh Rajan: ప్రేయసిని చూసేందుకు వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు ఓ మావోయిస్ట్. ఇది సినిమాలా అనిపిస్తుందా.. కానీ, రియల్ లైఫ్‌లోనూ జరిగింది.
Anirudh Rajan: ప్రేయసిని చూసేందుకు వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు ఓ మావోయిస్ట్. ఇది సినిమాలా అనిపిస్తుందా.. కానీ, రియల్ లైఫ్‌లోనూ జరిగింది. ఇలాంటి వార్త దావానంలా వ్యాపించడంతో.. అసలు మ్యాటర్ తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. బెంగళూరులో జరిగిన ఈ క్రైమ్ స్టోరీలో అడ్డంగా బుక్కయిన మావోయిస్ట్ పేరు అనిరుద్ద్ రాజన్. తన లవర్‌ని చూసేందుకు హరియాణా నుంచి బెంగళూరుకు చేరుకున్నాడు. అయితే, వల పన్ని మావోయిస్టును నేర నియంత్రణ విభాగం (సీసీబీ) ప్రత్యేక దర్యాప్తు దళం అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.
అనిరుద్ద్ రాజన్ సీపీఐ (ఎంఎల్) పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా ఉండడంతోపాటు, మావోయిస్టు దళాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత సాహిత్యం, రచనలను పంపిణీ చేస్తున్నాడనే అభియోగాలు ఉన్నాయి.
అయితే, అనిరుద్ద్ రాజన్ 4 రోజుల కిందటే బెంగళూరు నగరానికి వచ్చాడు. నగరంలోనే ఓ లాడ్జ్‌లో ఉన్నాడు. దీంతో అలర్ట్ అయిన సీసీబీ అధికారులు, ఉప్పారపేట ఠాణా పోలీసులతో కలిసి దాడులు చేశారు. ఊహించని విధంగా కథ అడ్డం తిరిగడంతో షాకైన అనిరుద్ద్ రాజన్.. చెన్నైకు వెళ్లేందుకు ప్లాన్ చేశాడు. దీంతో బస్ ఎక్కే క్రమంలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే, వికాస్ ఫాడ్గే పేరిట ఆధార్ కార్డు చేయించుకున్నాడని, అతని వద్ద నుంచి 4 సంచులు, పెన్ డ్రైవ్‌లు, ట్యాబ్‌లను పోలీసులు జప్తు చేశారు. అనిరుద్ద్ రాజన్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణను తీవ్రం చేసినట్లు పోలీసులు తెలిపారు.