ఆ బామ్మ గారిని చూస్తే నన్ను నేను ఎంతో మార్చుకోవాలనిపిస్తోంది: ఆనంద్ మహీంద్రా
ఆనంద్ మహీంద్రా ఈ పేరు ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎంతమందికి పరిచయమో చెప్పక్కర్లేదు. అంతకంటే ఎక్కువగా ఈయన సోషల్ మీడియాలో సుపరిచితులు.
ఆనంద్ మహీంద్రా ఈ పేరు ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎంతమందికి పరిచయమో చెప్పక్కర్లేదు. అంతకంటే ఎక్కువగా ఈయన సోషల్ మీడియాలో సుపరిచితులు. సామాజిక మాధ్యమాల్లో నిత్యం కనిపించే వారిలో మొదటి వరుసలో ఆనంద్ మహీంద్రా ఉంటారు. ఈయన సామజిక అంశాలకు సంబంధించి పోస్ట్ లు చేయడమే కాకుండా..అటువంటి పోస్టులు ఎవరు చేసినా వెంటనే స్పందించి తన అభిప్రాయాన్ని చెప్పడమే కాకుండా.. అటువంటి విషయాల్ని పదిమందికీ తెలిసేలా చేస్తుంటారు. మంచిని అందరికీ పంచడంలో ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందంజలోనే ఉంటారు. దాంతో అయనకు సామాజిక మాధ్యమాల్లో చాలా ఫాలోయింగ్ ఉంది.
ఇప్పుడు మరోసారి అయన తనదైన శైలిలో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఒక బామ్మగారు అలవోకగా వ్యాయామాలు చేస్తున్న వీడియోను నాందీ ఫౌండేషన్ సీఈవో మనోజ్ కుమార్ ట్వీట్ చేశారు. దానిపై స్పందించిన ఆనంద్ మహీంద్రా అద్భుతమైన కామెంట్ తో దానిని రీ ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్ లో ఉన్న బామ్మగారి వయసు 72 సంవత్సరాలు. చాలా అలవోకగా ఆమె కసరత్తులు చేసేస్తున్నారు. బరువులు చిటికెలో లేపేస్తున్నారు. అది చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా "వయసు ఒక సంఖ్య మాత్రమే అని ఈ మహిళ మళ్లీ నిరూపించారు" అంటూ క్యాప్షన్ రాశారు. అంతే కాదు.. ఆ ట్వీట్ చేసిన మనోజ్ కుమార్ ను ఉద్దేశిస్తూ.. ''మనోజ్ ఇప్పుడు మీరు ఈ వీడియోను ఎందుకు మీ ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ వీడియోను చూస్తుంటే నా వ్యాయామ, యోగా సమయాన్ని పెంచుకోవాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను'' అంటూ ట్విట్ చేశారు. అంతేకాకుండా ''ఈమె ఎంతో తెలికగా బరువులను ఎత్తేస్తున్నారు. ఎంతో కష్టమైన కసరత్తులను కూడా అలవోకగా చేసేస్తున్నారు. ఈ ఐరన్ లేడీని చూస్తుంటే నన్ను నేను ఎంతో మార్చుకోవాల్సి ఉంది'' అంటూ ఆనంద్ మనోజ్ ట్విట్‌ను రీ ట్విట్ చేస్తూ పేర్కొన్నారు.
ఈ ట్వీట్ ఇలా చేశారో లేదో వేలాది మంది చూశారు. దీనిని లైక్ చేశారు. అంతేకాకుండా ఆ వీడియోలో ఉన్న బామ్మగారికి ఫ్యాన్స్ అయిపోయామంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Why did you have to share this video in the morning, Manoj!? It's made me feel lazy and flabby compared to this iron woman... Ah well maybe this is the kick in the rear we all needed to stop making excuses about our exercise routines...☹️ https://t.co/9aQkWJp4lj
— anand mahindra (@anandmahindra) December 11, 2019