కర్ణాటకలో అమ్మాజీ స్వామి కిడ్నాప్ కలకలం సృష్టించింది. బార్లీ జిల్లా కపిలాపూర్ నుంచి దుండగులు స్వామీజీని కిడ్నాప్ చేశారు. విమానంలో షిర్డీ వెల్దామని చెప్పి హైదరాబాద్ నుంచి బెంగళూరు తరలించారు. స్వామిజీని విడిచిపెట్టాలంటే 20 కోట్ల నగదు, రెండు కిలోల బంగారం, 10 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము డిమాండ్ చేసిన డబ్బులు, బంగారం, భూమి ఇవ్వకపోతే స్వామీజీని చంపేస్తామని బెదిరించారు.
5 కోట్లు ఇస్తామని ఒప్పుకోవడంతో అమ్మాజీని కిడ్నాపర్లు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. స్వామీజీని హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో ఉంచారు. స్వామిజీ అనారోగ్యానికి గురైనట్లు చెప్పడంతో లంగర్‌హౌస్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఎట్టకేలకు కిడ్నాపర్ల గురించి వైద్యుని ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు స్వామిజీ. కిడ్నాపర్స్ భాస్కర్‌రెడ్డి, సతీష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాపర్లపై కనీసం కేసు కూడా నమోదు చేయకుండా లంగర్‌హౌజ్ పోలీసులు వదిలేసినట్లు సమాచారం. అయితే కావాలనే సీఐ కిడ్నాపర్లను వదిలేశారని ఆరోపిస్తున్నారు స్వామిజీ.