Ambassador: కనుమరుగు కానున్న అంబాసిడర్ కారు!
Ambassador Car: హిందుస్థాన్ మోటార్స్ తొలిసారిగా 1958లో అంబాసిడర్‌ను పరిచయం చేసింది.
Ambassador Car: ఒకప్పుడు కారు అంటే అంబాసిడర్ కారు మాత్రమే ఇండియాలో అంబాసిడర్ కార్లు తప్ప ఇక ఏ కార్లు ఉండేవి కాదు. ఒకవేళ ఏదన్నాకొత్త కంపెనీ వచ్చిన కూడా దాని పట్టించుకొనే వారు కాదు అంబాసిడర్ కారు అంటే రాయల్ గా భావించేవారు. కాల క్రమేణా టెక్నాలజీ పెరిగి రకరకాల అధునాతన మోడల్ కార్లు వచ్చినా.. భద్రతా పరంగా అంబాసిడర్ సేఫ్ అని భావించేవారు. అంబాసిడర్ సీఎన్జీ, ఎల్పీజీ వేరియంట్లలోనూ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
ఇలా విశేష సేవలందించిన దేశీ దిగ్గజ కార్ బ్రాండ్ అంబాసిడర్ కనుమరుగు కానుందా? అంటే అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. కారణం ఈ దిగ్గజ కార్ బ్రాండ్‌ను ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ ప్యుగోట్ సొంతం చేసుకోడమే. సీకే బిర్లా గ్రూపునకు చెందిన హిందుస్థాన్ మోటార్స్.. అంబాసిడర్‌ను రూ. 80 కోట్లకు ప్యుగోట్‌కు విక్రయించింది. వాస్తవానికి మూడేళ్ల క్రితమే అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని హిందుస్థాన్ మోటార్స్ ఆపేసింది.
అయితే ఇకపై భారత మార్కెట్‌లోకి ప్యుగోట్ తీసుకొచ్చే కార్లకు అంబాసిడర్ బ్రాండ్ వాడుతుందా.. లేదా.. అనే విషయంపై స్పష్టత లేదు. కంపెనీ కూడా దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో ఈ బ్రాండ్ నుంచి ఇకపై కార్లు వస్తాయనే నమ్మకం కూడా లేదు. తమిళనాడులో ప్యూగోట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు. తొలుత ఏటా లక్షవాహనాలు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇంగ్లండ్‌కు చెందిన ప్రఖ్యాత మోరిస్ ఆక్స్‌ఫర్డ్ సిరీస్ 2 కారులో కొద్దిగా మార్పులు చేసి హిందుస్థాన్ మోటార్స్ తొలిసారిగా 1958లో అంబాసిడర్‌ను పరిచయం చేసింది. కొద్దికాలంలోనే ఇది జాతీయ చిహ్నంగా మారిపోయింది. 1980 వరకు భారత రోడ్లపై అంబాసిడర్ హవా కొనసాగింది. అయితే మారుతీ 800 రూపంలో అంబాసిడర్‌కు గట్టి పోటీదారు ఎదురైంది. తరవాత అనేక కొత్త కార్లు భారత్‌లో అడుగుపెట్టడంతో అంబాసిడర్ హవా పడిపోయింది. 1980 వరకు సంవత్సరానికి 24వేల యూనిట్లు విక్రయించిన అంబాసిడర్.. 2013-14లో 2,500కి పడిపోయిందంటే తన మార్కెట్‌ను ఎంతమేర కోల్పోయిందో తెలుస్తోంది.