మొదలైన ఆన్‌లైన్ ఆర్డర్లు.. డెలివరీని ఆలస్యం.. ఎందుకంటే

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఉత్పత్తుల డెలివరీని ప్రారంభించాయి.

Update: 2020-05-04 05:53 GMT

ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఉత్పత్తుల డెలివరీని ప్రారంభించాయి.దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నుంచి గ్రీన్ జోన్స్ నుంచి మినహాయింపును ఇవ్వడంతో తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అమ్మకాలను స్టార్ట్ చేశాయి.

అయితే, అందరూ ఆర్డర్లు చేయలేరు. రెడ్ జోన్లలో ఉండే వినియోగదారులు అత్యావశ్యకమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయవచ్చు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే పూర్తి స్థాయిలో డెలివరీ చేయనున్నాయి. ఈ సంస్థలు తమ డెలివరీ బాయ్స్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిబంధనలు కచ్చితంగా పాటించాలని, వస్తువును వినియోగదారుడికి అందించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపాయి.

కస్టమర్ ఇంటి వద్ద లేకపోతే బయట డెలివరీ ఇచ్చేలా సంస్థలు డెలివరీ బాయ్స్‌కు సూచనలు చేశాయి. అంతేకాకుండా.. గతంలో కంటే ఈ సారి డెలివరీ ఆలస్యం అయ్యేలా ఉందని కూడా ఈ కామర్స్ సంస్థలు తమ వెబ్‌సైట్లలో పొందుపరిచారు.

Tags:    

Similar News