ఆ జడ్జి మాకొద్దు... మా కోర్టు చెత్త బుట్ట కాదు - హై కోర్టు లాయర్ల ఆందోళన
Delhi high court judge Yashwant Varma's transfer issue:

Allahabad High Court Bar Association : ఆ జడ్జి మాకు వద్దంటే వద్దు... మా కోర్టు చెత్త బుట్ట కాదు - లాయర్ల ఆందోళన
Delhi high court judge Justice Yashwant Varma: ఢిల్లీ హై కోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లోని ఒక గదిలో రూ. 15 కోట్ల నగదు దొరికిన కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణ జరుగుతుండగానే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జస్టిస్ వర్మను అలహాబాద్ హై కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం నిర్ణయించుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, ఆయన్ను మరోసారి తమ కోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేయొద్దంటూ అలహాబాద్ హై కోర్టులో లాయర్లు ఆందోళనకు దిగారు. "తప్పు చేసిన వారిని ఇలా తమ కోర్టుకు బదిలీ చేసి పంపించడానికి అలహాబాద్ హై కోర్టు ఏమైనా చెత్తబుట్టనా" అని అక్కడి లాయర్లు ప్రశ్నిస్తున్నారు.
అలహాబాద్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ఇతర జడ్జిలకు బార్ అసోసియేషన్ శుక్రవారం ఒక లేఖ రాసింది. ఢిల్లీ హై కోర్టు జడ్జిగా ఉండి భారీ మొత్తంలో నగదుతో దొరికిన జస్టిస్ వర్మను అలహాబాద్ హై కోర్టుకు బదిలీ చేయడంపై వారు ఆ లేఖలో అభ్యంతరం తెలిపారు.
ఢిల్లీ హై కోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ 2021 లో ఇదే అలహాబాద్ హై కోర్టు నుండి ఢిల్లీ హై కోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన్ను తిరిగి వెనక్కు పంపించనున్నారని తెలిసి శుక్రవారం అక్కడి న్యాయవాదులు ఇలా నిరసనకు దిగారు.
గత కొన్నేళ్లుగా అలహాబాద్ హై కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య చాలా తక్కువగా ఉందని అక్కడి బార్ అసోసియేషన్ చెబుతోంది. జడ్జిలుగా పదొన్నతి పొందుతున్న వారి వ్యక్తిత్వం, చరిత్రను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే న్యాయ వ్యవస్థలో అవినీతి పెరుగుతోందనే అసంతృప్తి కూడా అక్కడి బార్ అసోసియేషన్ లో వ్యక్తమవుతోంది.
ఢిల్లీ హై కోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ విషయంలోనూ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఘాటుగా స్పందించారు. న్యాయమూర్తుల ఎంపిక విషయంలో మరింత కఠినంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కపిల్ సిబల్ సుప్రీం కోర్టు కొలీజియంకు సూచించారు. తాజాగ అలహాబాద్ హై కోర్ట్ బార్ అసోసియేషన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.
More Interesting stories: మరిన్ని ఆసక్తికరమైన వార్తా కథనాలు
- ఢిల్లీ హై కోర్టు జడ్జి వర్మ ఇంట్లో రూ. 15 కోట్ల నగదు... హై కోర్టు జడ్జి తప్పు చేస్తే ఎవరు పనిష్మెంట్ ఇస్తారు?
- ఆ ఇంటి తాళం పగలగొట్టి చూస్తే 95 కిలోల బంగారం, 70 లక్షల నగదు బయటపడింది
- ఔరంగజేబ్ సమాధి కూలగొట్టాలని కొన్ని హిందూ సంఘాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి? 300 ఏళ్ల క్రితం చనిపోయిన మొఘల్ సామ్రాట్పై ఇప్పటికీ ఎందుకంత కోపం?
- సునీత విలియమ్స్ చిన్నప్పటి లక్ష్యం వేరు... చివరకు అయ్యింది వేరు