యూపీ అసెంబ్లీలో ఢిష్యుం ఢిష్యూం... డిప్యూటీ సీఎం మౌర్య వ్యాఖ్యలపై అఖిలేశ్ కౌంటర్

*బీజేపీ కంటే సమాజ్ వాదీ పాలన భేషన్న అఖిలేశ్

Update: 2022-05-26 06:54 GMT

యూపీ అసెంబ్లీలో ఢిష్యుం ఢిష్యూం

Uttar Pradesh: యూపీ అసెంబ్లీలో నేతల మధ్య లొల్లి దేశ వ్యాప్త సంచలనానికి కారణవుతోంది. యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యపై ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అసెంబ్లీలో దుమారం రేగింది. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకొంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అఖిలేశ్ అసభ్య పదజాలంతో సభ్యులను దూషించడం దారుణమన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. బెదిరించడం కోసం అసెంబ్లీని వాడుకోవద్దంటూ సమాజ్ వాదీ పార్టీ నేతలను సీఎం గట్టిగా హెచ్చరించారు.

గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా గతంలో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన పనులను ప్రశంసిస్తున్నానంటూ డిప్యూటీ సీఎం మౌర్య చురకలతో ఎస్పీ అధినేత అఖిలేశ్ ఆగ్రహానికి గురయ్యాడు. సమాజ్ వాదీ పార్టీ మంచి పనులు చేసుంటే ప్రజలు ఆ పార్టీకి ఇలాంటి తీర్పు ఇచ్చేవారు కాదన్న వర్షన్ విన్పించారు మౌర్య. ఐదేళ్లలో ఏం చేశారన్నది చెప్పడానికి అఖిలేశ్ ఏమీ అలసిపోలేదని ఒకవేళ అలా జరిగితే ఆయనకు రోగానికి ట్రీట్మెంట్ అందిస్తామన్నారు. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ చికిత్స చేయిస్తామన్నారు. అఖిలేశ్‌కు ఉన్న జబ్బు పేరు పథకాలకు స్టిక్కర్ అందించడమేనంటూ ఎద్దేవా చేశారు మౌర్య. గతంలో యూపీ అభివృద్ధికి సమాజ్ వాదీ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు అఖిలేశ్ సంక్షేమ కార్యక్రమాలతో పేదలను ఆదుకున్న ఘనత సమాజ్ వాదీ పార్టీన్నారు.

అఖిలేశ్ అభివృద్ధిని అంగీకరించాలని ప్రస్తుతం ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నారని మరో ఐదేళ్ల పాటు కాదు కాదు. వచ్చే 25 ఏళ్ల వరకు ఛాన్స్ లభించదన్నారు మౌర్య. యూపీలో చేపడుతున్న రోడ్ల నిర్మాణం, ఎక్స్‌ప్రెస్‌వే, మెట్రో ఎవరు చేస్తారని ప్రశ్నించారు. మీ భూములు అమ్మి ఇదంతా కట్టారా అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రి వ్యాఖ్యలతో అఖిలేష్ యాదవ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సమాజ్ వాదీ పార్టీ సభ్యులు సైతం ఆయనకు దన్నుగా నిలిచారు. అఖిలేష్ యాదవ్ రెచ్చిపోవడంతో యోగి ఆదిత్యనాథ్ రంగంలోకి దిగి మంత్రిపై అసభ్య పదజాలం ఉపయోగించడం సరికాదన్నారు. ఇంతగా రెచ్చిపోయి ఉండాల్సింది కాదంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధి పనులను ఏ ప్రభుత్వమైన కొనసాగించాల్సిందేనన్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను చెప్పుకునేందుకు ప్రభుత్వానికి హక్కు ఉందన్నారు యోగి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాలని వినే ఓపిక ఉండాలన్నారు.

Tags:    

Similar News