దేశ రాజధానిలో మెరుగుపడని గాలి నాణ్యత.. రోజూ 300 పాయింట్లు దాటి నమోదవుతున్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
* ఈ ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 309గా నమోదు
Delhi AQI: దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు కాలుష్యానికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో మార్పు రావటంలేదు. ప్రస్తుతానికి స్టేజ్ 3 నిబంధనలు అమలు చేస్తున్నారు. పలు చోట్ల నిర్మాణాలపై నిషేధం విధించారు. వాహనాలూ ఎక్కువ మొత్తంలో తిరగకుండా ఆంక్షలు విధించారు. BS-3, BS-4 వాహనాలు రోడ్లపై తిరగకూడదని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయినా కొందరు ఈ నిబంధనను పట్టించుకోకుండా రోడ్లపైకి వాహనాలు తీసుకొచ్చారు. వీరిపై పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఈ నిబంధన ఉల్లంఘించిన పలు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ కాలుష్య సమస్య రోజురోజుకీ సంక్లిష్టమవుతోంది. ఎయిర్ క్వాలిటీ పడిపోతూ వస్తోంది. మరోసారి అక్కడి గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుందని అధికారులు వెల్లడించారు.