Delhi MCD Elections: మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జయకేతనం

Delhi MCD Elections: 250 స్థానాల్లో 134 స్థానాలు కైవసం చేసుకున్న ఆప్

Update: 2022-12-07 09:55 GMT

Delhi MCD Elections: మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జయకేతనం

Delhi MCD Elections: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయ దుందుభి మోగించింది. 250 స్థానాలున్న MCDలో మేజిక్ ఫిగర్ 126 స్థానాలకంటే ఎక్కువే ఆప్ కైవసం చేసుకుంది. ఏకంగా 134 స్థానాల్లో ఆప్ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. ఒక దశలో గట్టిపోటీ ఇచ్చిన అధికార బీజేపీ 104 స్థానాలకే పరిమితమైంది. ఫలితంగా 15 ఏళ్ల బీజేపీ పాలనకు ఢిల్లీ ఓటర్లు చరమగీతం పాడారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభావం నామమాత్రమే అని చెప్పొచ్చు. ఆ పార్టీ కేవలం 9 స్థానాల్లో గెలిచి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ముగ్గురు ఇండిపెండెట్లు గెలిచారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈ నెల 4న పోలింగ్ జరగ్గా.. 50.47 శాతం ఓటింగ్ నమోదైంది. ఇవాళ విడుదలైన ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ MCDలో అరంగేట్రం చేసింది. ఎగ్జిట్ పోల్స్‌కు భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. ఎంసీడీలో ఆప్ పాగా వేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

Tags:    

Similar News